బరువు నియంత్రణ కొందరికి పెద్ద సవాలే. శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. అలోవెరా (Aloe vera) ను మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు. శరీరం బరువు తగ్గించుకోవాలనుకునే వారు అలోవెరాను వివిధ రకాలుగా డైట్‌లో చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
1. అలోవెరా జెల్‌ను ఆకుల నుంచి తీసి వినియోగించుకోవాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
2. జెల్ రుచి కాస్తా వికారంగా ఉంటున్నందున దీనిని తీసుకోవడానికి ముందు శుభ్రంగా కడగాలి.
3. బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి కలబంద రసాన్ని నిత్యం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
4. ఆహారం తీసుకోవడానికి కనీసం 15 నిమిషాల ముందు ప్రతి రోజు ఒక టీ స్పూన్ దీని రసం తాగడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
5. కలబంద జ్యూస్‌ను నేరుగా తాగేందుకు ఇబ్బందిగా ఉన్నట్లయితే ఇతర కూరగాయల ముక్కలతో కలిపి జ్యూస్‌గా చేసి తాగొచ్చు.
6. అలోవెరాలో ఏ, సీ , ఈ విటమిన్లు ఉంటాయి. మన శరీరంలో కణాల పెరుగుదలకు, జుట్టు మెరిసేలా చేస్తాయి.
7. అలోవెరా జెల్‌లో విటమిన్ బీ 12, ఫోలిక్ యాసిడ్ ఉండి శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి.
also read:
Horoscope (10-02-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
Joe Biden : అగ్రరాజ్య సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం.. చైనాకు బైడెన్ హెచ్చరిక