Homehealthweight loss tips in telugu : తొందరగా బరువు తగ్గాలంటే ఏం చేయాలి ?

weight loss tips in telugu : తొందరగా బరువు తగ్గాలంటే ఏం చేయాలి ?

Telugu Flash News

weight loss tips : అన్ని రుచులకు సంబందించిన ఆహారాలను మనము తీసుకుంటుండాలి. ఒకే రకమైన ఆహారానికి పరిమితం కాకూడదు. దీనినే షడ్రసోపేతమైన ఆహారం అని ఆయుర్వేదం అంటుంది.   ఆహారంలో 60 శాతం పిండి పదార్థాలను , 20 శాతం మాంసకృత్తులు , 20 శాతం కొవ్వు పదార్థాలు  ఉండేలా చూసుకోవాలి. మాంసాహారులైతే గొర్రె , పోర్క్, బీఫ్ కు బదులు చర్మం తొలగించిన కోడి, చేపల మాంసం తినాలి. తియ్యని పండ్లు, డ్రైఫ్రూట్స్ బదులు రసం కలిగిన తాజా పండ్లు తీసుకోవాలి.

తొందరగా , గబగబా తింటే ఎంత తిన్నారో, ఏమి తిన్నారో తెలియక ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. కనుక నెమ్మదిగా ప్రతి ముద్దనూ నమిలి, రుచిని ఆస్వాదిస్తూ తినాలి. దీంతో లాలాజలం విడుదలై ఆహారం బాగా జీర్ణమవుతుంది. తినేటప్పుడు వేరే పనిమీద దృష్టిపెట్టకూడదు.

మాట్లాడుకుంటూ, టీవీ చూస్తూ, చదువుతూ తినకూడదు. ప్రధాన ఆహారపు వేళల మధ్యలో చిరుతిండ్లు తినకూడదు. ద్రాక్షపండ్లు. జామపండ్లు వంటివి తినవచ్చు. ఇవి సుఖవిరేచనానికి సహకరిస్తాయి. మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారం ఎక్కువగానూ, రాత్రి పూట తీసుకునే ఆహారం అల్పమోతాదులోనూ ఉండాలి.

అధిక బరువును తగ్గించడంలో





తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే అధిక బరువును తగ్గించడంలో చక్కని ఫలితం కనిపిస్తుంది. కాకపోతే ఏడాది కాలంపాటు నిల్వ ఉంచిన పాత తేనెను వాడాలని ఆయుర్వేదం సూచిస్తుంది. గోధుమలు, బార్లి, ఓట్స్ లలో అధిక మొత్తాల్లో పీచు పదార్థం ఉంటుంది. ఇది కొవ్వును పేరుకుపోకుండా చేస్తుంది. పీచువల్ల మలమూత్రాల నిర్వాహణ సజావుగా జరుగుతుంది.

ఏడాదిపాటు పాతబడిన బియ్యాన్ని వాడుకుంటే బరువు పెరగకుండా ఉంటారు. అయితే బియ్యం వాడితే కఫం పెరిగి లావెక్కుతారని ఆయుర్వేదం చెబుతుంది కనుక స్థూలకాయులు వాడకూడదు.

పప్పుదినుసుల్లో మాంసకృత్తులు, పీచు అధికంగా ఉంటాయి. పెసర్లు లఘువుగా ఉంటాయి. కనుక మంచివి. అలాగే ఉసిరి, పొట్ల, ఆకుకూరలు, అన్ని మంచివే. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు వంటివి హితకరంగా ఉంటాయి.

-Advertisement-

జీలకర్ర, ధనియాలు, సోంపు గింజలు, ఏలక్కాయలు, అల్లం, దాల్చిన చెక్క వంటివి ఆహారంలో ఎక్కువగా ఉపయోగించాలి. వేడి నీటిని త్రాగితే సన్నబడుతారు. వేడినీళ్ళ స్నానము మంచిదే. స్థూలకాయులు చన్నీళ్ళు వాడకూడదు.

మజ్జిగ తేలిగ్గా ఉంటుంది. అలాగే ఊబ శరీరాన్ని ఎండిపోయేలా చేస్తుంది. మజ్జిక 3 రుచులు కలిగి ఉండటం వల్ల ఇది త్రిదోషహారంగా పనిచేస్తుంది. పులుపువల్ల వాతం, తీపివల్ల పిత్తం, కషాయంవల్ల కఫం తగ్గుతాయి.

మజ్జిగను వాతాధిక్యతలో(నొప్పులు, గ్యాస్ ఉన్నప్పుడు) సైంధవ లవణంతోను, పిత్తాధిక్యతలో (మంటలు, జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు) పటికబెల్లంతోను, కఫాధిక్యతలో (జలుబు వంటివి ఉన్నప్పుడు) త్రికటు చూర్ణంతోను తీసుకోవాలి. అయితే మజ్జిగను వెన్న తీసి మాత్రమే వాడాలి.

ఆహారానికి ముందు నీళ్ళు త్రాగాలి. ఆహారానికి ముందు 2 గ్లాసుల నీళ్ళు తాగితే సన్నబడతారని ఆయుర్వేద సంహితా గ్రంథంలో అష్టాంగ హృదయం చెబుతుంది. ఆహారం తీసుకున్న వెంటనే మంచినీళ్ళు తాగితే లావెక్కుతారు కనుక కనీసం అరగంట వరకూ ఆగాలి.

బాధ్యతారహితమైన జీవన విధానంవల్ల స్థూలకాయం సిద్ధిస్తుంది కనుక శరీరంలో అధికంగా కొవ్వు చేరకుండా ఉండాలంటే అనుక్షణం చింత(ఆలోచన) చేయాలని ఆయుర్వేదం చెబుతుంది.

also read :

Rashmika: స‌మంత ఆరోగ్యం గురించి స్పందించిన ర‌ష్మిక‌.. ఎమోష‌న‌ల్ అవుతూ స్ట‌న్నింగ్ కామెంట్

సర్వరోగ నివారిణి గోధుమగడ్డి (WheatGrass) ఉపయోగాలు తెలుసుకోండి

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News