స‌మంత‌కి సోకిన 'మయోసైటిస్‌' వ్యాధి అంత డేంజ‌రా..ఆ వ్యాధి లక్షణాలు ఏంటి ?

స‌మంత చేసిన ఓ ట్వీట్ అభిమానుల‌కి పెద్ద షాక్ ఇచ్చింది. అరుదైన వ్యాధి ‘మయోసైటిస్‌’తో బాధపడుతున్నట్టు స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం వెల్లడించారు.

ఆమె ట్వీట్ చేసిన వెంటనే అభిమానులు, సహ నటులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు స‌మంత త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆమె పోస్ట్‌కి బ‌దులు ఇచ్చారు.

మయోసైటిస్‌ వ్యాధి ల‌క్ష‌ణాలు ఇవే..

ఈ వ్యాధి వ‌చ్చిన వారికి కండ‌రాల స‌మస్య ఏర్ప‌డుతుంది. ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లల్లో ఇది వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.

రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకర కణజాలం మీద దాడి చేయడం వల్ల ఈ వ్యాధికి గురవుతారని, దీనిలో పాలి, డెర్మటో, ఇన్‌క్లూజన్‌ బాడీ మయోసైటిస్‌ వంటి పలు రకాలున్నాయంటూ వైద్యులు స్ప‌ష్టం చేశారు.

కండరాల నొప్పులు, అలసట, మింగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలుగా మ‌నం చెప్పుకోవచ్చు.