హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది.. ఇన్‌ఫెక్షన్ పేరుతో 10 రోజుల బాబు కు ముక్కు లేకుండా చెయ్యడం పై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వైద్యులు చేసిన పనికి నిరసనగా తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు .ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయం తెలిసిన సిబ్బంది చిన్నారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు శుక్రవారం ఆస్పత్రి ఎదుట బైఠాయించారు.
వివరాల్లోకి వెళితే..పాతబస్తీ కాలా పత్తర్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ ఖాన్, హర్షనుస్సా ఖాన్ దంపతులు. వారు 13 సంవత్సరాల కింద వివాహం చేసుకున్నారు. కానీ సంతానం లేదు.
పలు ఆసుపత్రులకు వెళ్లినా ఫలితం లేకపోయింది. హర్షనూసా 13 ఏళ్ల తర్వాత ఇటీవలే గర్భం దాల్చింది. జూన్ 8న హర్షనుస్సా ఖాన్ అందమైన బాబుకు జన్మనిచ్చింది.
ఇందుకోసం హైదర్‌గూడలోని ఫెర్నాండెజ్ ఆస్పత్రిలో చేర్పించారు. పుట్టిన వెంటనే శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని గమనించిన వైద్యులు వెంటనే ఐసీయూకి తరలించారు.
అప్పటి నుంచి పాప ఐసీయూలో ఉంది. పది రోజుల తర్వాత వైద్యులు బాబును తల్లిదండ్రులకు చూపించారు. ఆ సమయంలో చిన్నారి ముక్కు నల్లగా ఉంది.
మళ్లీ చిన్నారిని చూపించడంతో.. మొదట చూపించినప్పుడు ఉన్న నల్లటి భాగం ఊడిపోయింది. ఏం జరిగిందని వైద్యులను ప్రశ్నించారు.
ఆసుపత్రి బిల్లు రోజుకు రూ. 35000 చొప్పున వసూలు చేయగా, ఇప్పటివరకు రూ. 5 లక్షల వరకు బిల్లు కట్టామని.. ఇప్పుడు బాబుకు ముక్కు లేకుండా చెయ్యడం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.