పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు తరచుగా ఆందోళన చెందే విషయాలలో జ్వరం ఒకటి. పెద్దలకు తలనొప్పి ఎంత తరచుగా వస్తుందో, పిల్లలకు జ్వరం అలా వస్తుంటుంది.
స్వెటర్లు, తలకు క్యాప్ లాంటివి వేయకూడదు. సన్నటి వదులుగా ఉండే కాటన్ దుస్తులు మాత్రమే వేయాలి. పసిపిల్లలకు న్యాప్కిన్ సరిపోతుంది.
తడి వస్త్రంతో శరీరం అంతా తుడవాలి. ముఖ్యంగా మెడ, చంకలు, గజ్జలలో తుడవడం అవసరం. కేవలం నుదురుపై తడి వస్త్రం ఉంచడం వల్ల ఉపయోగం లేదు.
జ్వరానికి పారాసిటమాల్ మందు డాక్టర్లు సూచించిన మోతాదు ఇవ్వాలి. మందు వేసిన వెంటనే వాంతి చేసుకుంటే తిరిగి ఇవ్వాలి.
జ్వరంతో ఉన్నపిల్లలకు వారికి ఇష్టమైన ఆహారం ఏదైనా ఇవ్వొచ్చు. ముఖ్యంగా రాగి జావ, కొబ్బరి నీళ్లు, పండ్లు ఇవ్వాలి. ఆహారం తినిపించకపోతే మరింత నీరసం అవుతారు. తరచూ నీళ్లు తాగించాలి.