బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌

భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌.. బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనుండడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

రిషి సునాక్‌ పూర్వీకులు పంజాబ్‌ రాష్ట్రం వారు. 1980 మే 12న బ్రిటన్‌లోని సౌథాంప్టన్‌లో రిషి సునాక్‌ జన్మించారు.

స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా అందుకున్న రిషి.. అంతకుముందు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకానమీ కోర్సుల్లో పట్టా అందుకున్నారు. 

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి సునాక్‌ పెండ్లి చేసుకున్నారు. రిషి సునాక్‌, అక్షత మూర్తి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

తొలిసారి 2014లో రిచ్‌మండ్‌ నుంచి బ్రిటన్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2017, 2019 ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు.

తొలుత బ్రిటన్‌ సహాయ మంత్రిగానూ, తర్వాత క్యాబినెట్‌ మంత్రిగా, చాన్స్‌లర్‌గా పని చేశారు. బ్రిటన్‌ చాన్స్‌లర్‌గా పని చేసిన తొలి భారతీయుడిగానూ రిషి సునాక్‌ చరిత్ర నెలకొల్పారు.

బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయగానే ప్రధాని పదవి రేసులో తానూ ఉన్నట్లు ముందే ప్రకటించారు రిషి సునాక్‌. కానీ తన వెన్నంటి ఉంటూ తనకు వెన్నుపోటు పొడిచాడన్న అనుమానంతో రిషి సునాక్‌ను బోరిస్‌ జాన్సన్‌ వ్యతిరేకించారు.

మెజారిటీ అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలు రిషి సునాక్‌కు మద్దతు ఇచ్చినా.. పార్టీ సభ్యులు లిజ్‌ ట్రస్‌ వైపు మొగ్గు చూపారు. 

 45 రోజులకే ప్రధాని పీఠం నుంచి లిజ్‌ ట్రస్‌ వైదొలిగారు. లిజ్‌ ట్రస్‌ వారసుడిగా రిషి సునాక్‌ పోటీ పడ్డారు.

బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌ ఆ దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఈ నెల 28న బ్రిటన్‌ ప్రధానిగా ప్రమాణం చేస్తారు.

thanks for watching..

Heart