Weather Today : రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే ఐదు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకన్నా తక్కువ నమోదయ్యే చాన్స్ ఉందని పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో ఇవాళ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన కొన్ని జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్‌లో నిన్న కుండపోత వర్షం కురిసింది. ఈరోజు కూడా వర్షం పడే చాన్స్ ఉంది.
హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నేడు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, అనంతపురం పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ధర్మవరంలో వర్షాలు కురిసే చాన్స్ అధికంగా ఉంది. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి.
రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం అధికారులు హెచ్చరించారు.
also read :