Telugu Flash News

Weather Today: తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా.. (14-05-2023)

Young man and heat stroke.

Weather Today: మోచా తుపాను ఇవాళ తీరం దాటనుంది. ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీలోని పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి.

తెలంగాణలో ఇప్పటికే సాధారణ ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పెరిగాయి. రాగల మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుంది. హైదరాబాద్‌, చుట్టుపక్కల జిల్లాల్లో 37 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కానుంది.

మోచా తుపాను ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. మొత్తం 125 మండలాల్లో వడగాల్పులు వీచే ఆస్కారం ఉందని పేర్కొంది.

Read Also : horoscope today telugu : 14-05-2023 ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు

Exit mobile version