Telugu Flash News

Weather Today (12-05-2023): తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా..

Cyclone Mocha

Weather Today: మోచా తుపాను నేడు ప్రభావంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దాంతోపాటు మోచా తుపాను ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి రాష్ట్రంలోని కొన్ని చోట్ల సుమారు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌ ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యే చాన్స్ ఉంది.

ఇక తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొడి వాతావరణమే ఉంటుంది. రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు.

Read Also : horoscope today telugu : 12-05-2023 శుక్రవారం ఈ రోజు రాశి ఫలాలు

Exit mobile version