Weather Today: తెలుగు రాష్ట్రాలకు మోచా తుపాను ముప్పు దాదాపు తప్పిపోయింది. ఈ మేరకు మోచా తుపాను ప్రభావం తెలంగాణ, ఏపీపై ఉండబోదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.
మోచా తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షం కురుస్తుందని మొదట అంచనా వేశారు. కానీ అందుకు భిన్నంగా తుపాను ప్రభావం రాష్ట్రంపై పడట్లేదని తేలింది. మరోవైపు ప్రజలు ఇక ఉక్కపోత భరించాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. ఇక ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 లేదా 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.
ఈనెల 11వ తేదీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఉక్కపోతేనని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 10 వతేదీ నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేస్తున్నారు. 11 తర్వాత విపరీతమైన వడగాల్పులు ప్రజలను ఊపిరి ఆడనీయకుండా చేస్తాయని చెబుతున్నారు.
థార్ ఎడారి నుంచి వచ్చే గాలులు ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై పడుతుందని ఐఎండీ పేర్కొంది. దీని వల్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరుగనున్నాయి.
Read Also : indian currency : మన కరెన్సీ ముద్రించడానికయ్యే ఖర్చెంతో తెలుసా?