Telugu Flash News

Weather Today (30-5-2023): తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా..

Weather report

Weather Today: తెలుగు రాష్ట్రాల్లో నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు.

ఆయా జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

మంగళవారం మిగిలిన జిల్లాల్లో కూడా పలుచోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. అలాగే 31వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. అదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల దాకా నమోదవుతాయని తెలిపారు.

ఇప్పటికే రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వానలు పడుతుండగా.. నేడు పలు జిల్లాలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

Read Also : today horoscope in telugu : 30-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

Exit mobile version