Telugu Flash News

Weather Today (28-5-2023): తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా..

Young man and heat stroke.

Weather Today: దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి. హర్యానా, ఈశాన్య రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే చాన్స్‌ ఉందని పేర్కొంది.

అరేబియా సముద్రం వల్ల వచ్చే తేమ కారణంగా వాయువ్య భారతదేశంలో మే 28, 29న ఇదే వాతావరణం ఉంటుందని, మరో 5 రోజుల పాటు వాయువ్య భారతదేశంలో పిడుగులు పడే చాన్స్‌ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

నిన్న ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఓవైపు ఎండ, మరోవైపు వానలు కురుస్తున్నాయి. రోహిణి కార్తె కావడంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.

తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో నేడు భారీ ఉష్ణోగ్రతలు, అదే క్రమంలో కొన్ని ఏరియాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఏపీలోనూ ప్రజలకు రెయిన్ అలర్ట్ వచ్చింది.

ద్రోణి ప్రభావంతో నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, ఓపెన్‌ ప్లేస్‌లలో కూడా ఉండొద్దని హెచ్చరించారు.

Read Also : today horoscope in telugu : 28-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

Exit mobile version