Weather Today: దేశ వ్యాప్తంగా వడగాలుల ప్రభావం తగ్గిందని భారత వాతావరణ విభాగం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్నాళ్లుగా ప్రజలు హీట్ వేవ్‌తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ పేర్కొంది.
దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ విభాగం పేర్కొంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
వచ్చే మూడు రోజులు ఉత్తర తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల దాకా నమోదయ్యే చాన్స్ ఉంది. హైదరాబాద్, పరిసర ప్రాంత జిల్లాల్లోనూ 41 డిగ్రీల దాకా గరిష్ట ఉష్ణోగ్రతలుంటాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నేడు వర్షాలు పడే చాన్స్ ఉంది.
ఇవాళ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు.
ఇక నేడు, రేపు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, పెనుగంచిప్రోలు, గుంటూరు జిల్లా గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని,తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు, పల్నాడు జిల్లా అమరావతి, అచ్చంపేట, పెదకూరపాడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది.
Read Also : Today Horoscope : 25-05-2023 ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది..