Weather Today: వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. నేడు, రేపు వర్షాలు కురుస్తాయని, ఎల్లుండి కాస్త పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల దాకా నమోదయ్యే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు.హైదరాబాద్ పరిసర జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
నేడు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
ఇక ఏపీలో నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉంది. రాగల మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Read Also : today horoscope in telugu : 24-05-2023 ఈ రోజు రాశి ఫలాలు