Telugu Flash News

Weather Today (23-05-2023): తెలుగు రాష్ట్రాలకు కాస్త చల్లటి కబురు.. నేటి వాతావరణం ఇలా..

today weather report

Weather Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ నేడు కాస్త చల్లని కబురు చెప్పింది. రాగల మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

ఉత్తర తెలంగాణ జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల దాకా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నేడు తూర్పు, దక్షిణ జిల్లాల్లోనూ, రేపు దక్షిణ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇవాళ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.

మరోవైపు ఏపీలోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల దాకా పెరిగే చాన్స్‌ ఉందని తెలిపారు. రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అధికారులు తెలిపారు.

Read Also : today horoscope in telugu : 23-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

Exit mobile version