Weather Today: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణమే కొనసాగుతుందని, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యే చాన్స్ ఉంది. నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో, రేపు ఈ జిల్లాలలో పాటు ఈసాన్య జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవయ్యే అవకాశం ఉంది.
రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు ఎండలు ఠారెత్తిస్తాయని అధికారులు తెలిపారు. సీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ పెరుగుతుందన్నారు. నిన్న ఏపీలోని రాజమహేంద్రవరంలో రికార్డు స్థాయిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Read Also : horoscope | రాశి ఫలాలు 18-05-2023