Telugu Flash News

Weather Today (17-05-2023): నిప్పుల కొలిమి.. తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా..

Young man and heat stroke.

weather today: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. నిన్న ఏపీలోని రాజమహేంద్రవరంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఎండ వేడిమికి అద్దం పడుతోంది. ఈ స్థాయిలో ఎండలు మండిపోతుండడంతో జనం అల్లాడున్నారు.

రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణమే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారుగా 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.

హైదరాబాద్‌ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల దాకా ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 13 మండలాల్లో 46 డిగ్రీలకు, 39 మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వడగాలుల ప్రభావం రేపు కూడా కొనసాగుతుందని వాతావరణ విభాగం అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు విపత్తుల సంస్థ నుంచి హెచ్చరిక సందేశాలు పంపుతున్నామని, ఇవి చూసిన సందర్భాల్లో ప్రజలు అప్రమత్తంగ వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు.

ముఖ్యంగా వృద్దులు, గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రయాణాల్లో ఉన్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

Read Also : horoscope | రాశి ఫ‌లాలు 17-05-2023

Exit mobile version