Telugu Flash News

Wasim Akram: ఆ కెప్టెన్ నన్ను ఓ పనోడిలా చూసేవాడు..

Wasim Akram: పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన వసీం అక్రమ్ రీసెంట్‌గా తన ఆటో బయోగ్రఫీని విడుదల చేయ‌గా, ఇందులో త‌న సహచర ఆటగాడు, మాజీ సారథిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తనకంటే రెండేళ్లు ముందు జట్టులోకి వచ్చిన కారణంగా.. తనను జూనియర్‌గా భావించి ప‌నులు చేయించుకునేవాడని, కట్టు బానిసలాగా ట్రీట్ చేసేవాడని అందులో పేర్కొన్నాడు.

వసీం అక్రమ్ ఆటో బయోగ్రఫీ ‘సుల్తాన్ : ఎ మెమోయిర్’ పుస్తకం ద్వారా అక్రమ్ ఈ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశాడు. సలీమ్ మాలిక్ 1982లో పాక్ జట్టులోకి రాగా అక్రమ్ 1984లో జట్టులోకి వచ్చాడు.

అక్రమ్ తన పుస్తకంలో.. ‘తన కంటే రెండేళ్లు జూనియర్ అయినందుకు అతను దానిని అడ్వంటేజీగా తీసుకునేవాడు. నాతో ఎప్పుడూ నెగిటివ్ గా ఉండేవాడు. సెల్ఫిష్. ఎప్పుడూ నన్ను తనకు ఓ పనోడిలా భావించి, తనకు మసాజ్ చేయమని అడిగేవాడు. తన మాసిన బట్టలు, బూట్లను కూడా ఉతకమనేవాడు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది.’అని రాసుకొచ్చాడు.

ఇమ్రాన్ ఖాన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక పాకిస్థాన్ సారథిగా సలీమ్ మాలిక్ ఎంపికయ్యాడు. 1992 నుంచి 1995 వరకు అక్రమ్.. మాలిక్ సారథ్యంలోనే ఆడాడు.

ఈ ఇద్ద‌రి మ‌ధ్య వివాదాలు ఉన్నాయి అని అప్ప‌ట్లో పాక్ మీడియా వ‌రుస క‌థ‌నాలు వెలువ‌రించింది. అయిన‌ప్ప‌టికీ వీరు నోరు తెర‌వ‌లేదు. అక్ర‌మ్ తాజాగా త‌న పుస్తకం ద్వారా అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు.

సలీమ్ మాలిక్.. 2000 ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కొని జీవితకాల నిషేధం ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. అయితే వ‌సీం చేసిన ఆరోప‌ణ‌ల‌ని మాలిక్ ఖండించాడు. ఆయ‌న చెప్పేవ‌న్నీ అవాస్త‌వాల‌న్నీ తెలియ‌జేశాడు.

వసీం తన పుస్తకం అమ్మకాలు పెంచుకునేందుకు ఇదంతా చేస్తున్నాడని , తాను కెప్టెన్‌గా ఉండగా వసీం.. వకార్ యూనిస్ తనతో అస్స‌లు మాట్లాడేవారు కాదని తెలిపాడు. చూస్తుంటే వ‌సీం పుస్తకం రానున్న రోజుల‌లో మ‌రింత ప్ర‌కంప‌న‌లు పుట్టించ‌డం ఖాయంగా తెలుస్తుంది.

also read news:

Tollywood: ఈ 10 సినిమాలు సూప‌ర్ హిట్.. కాని స‌మాజానికి ఎంత‌లా చెడు సందేశం అందించాయంటే..

హీరో, హీరోయిన్ల క్యారవాన్‌ కల్చర్‌ వల్ల టైం వేస్ట్‌ ఎక్కువ.. దిల్‌రాజు షాకింగ్‌ కామెంట్స్‌

 

Exit mobile version