HomecinemaWaltair Veerayya: ఓటీటీలోకి వాల్తేరు వీర‌య్య‌.. ఎప్పుడంటే ?

Waltair Veerayya: ఓటీటీలోకి వాల్తేరు వీర‌య్య‌.. ఎప్పుడంటే ?

Telugu Flash News

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ . సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ క‌లెక్ష‌న్స్ వ‌ర్షం కురిపించింది.. రీసెంట్ గా ఈ చిత్రం 25 రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకోవ‌డంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రిలీజ్‌ డేట్ ను అనౌన్స్ చేసింది. ఈనెల (ఫిబ్రవరి 27)నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంచబోతున్నట్టు ప్రకటించింది.

చిత్రంలో చిరు వింటేజ్ లుక్ లో అలరించడం, మాస్ మహారాజా కీలక పాత్రలో నటించడంతో థియేటర్లలో ఫ్యాన్స్ పరిస్థితి పూనకాలనే చెప్పాలి. దీంతో సినిమాను ఓటీటీలోనూ చూసేందుకు అభిమానులు, ఓటీటీ ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు.

వాల్తేరు వీరయ్య ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. దాదాపు అన్నీ ఏరియాల్లో మంచి వసూళ్లను సాధించి పెట్టిందీ చిత్రం.ఈ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. శృతిహాసన్ కథానాయికగా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

also read:

Headphones అధికంగా వినియోగిస్తే ఏమవుతుందో తెలుసా?

Fruits to Help You Sleep : ఈ ఫ్రూట్స్‌ తింటే హాయిగా నిద్ర పడుతుంది

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News