Telugu Flash News

gutta jwala vishnu vishal : ఇండ‌స్ట్రీలో మ‌రో జంట విడాకులు.. ఇందులో నిజ‌మెంత‌?

gutta jwala vishnu vishal news:  ఇటీవ‌లి కాలంలో ఎంతో మంది జంట‌లు త‌మ జీవితాన్ని లేని పోని కార‌ణాల వ‌ల‌న నాశ‌నం చేసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా చిన్న చిన్న కార‌ణాల‌తో విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కోలీవుడ్ హీరో విష్ణు విశాల్.. త‌న భార్య‌కి విడాకులు ఇవ్వ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం న‌డుస్తుంది. అందుకు కార‌ణం కొద్ది రోజుల క్రితం ఆయ‌న చేసి ట్వీట్‌.

విష్ణు విశాల్ చేసిన ట్వీట్‌లో.. నేను చాలా ప్రయత్నించాను. అయినా కూడా ఫెయిల్ అవుతూనే ఉన్నాను. కానీ దాన్నుంచి గుణపాఠాన్ని అయితే నేర్చుకుంటున్నాను. అది ఫెల్యూర్ కాదు పూర్తిగా నా తప్పే! అదోక మోసపూరిత ద్రోహం‘ అని చెబుతూ దానికి లైఫ్ లెస్సన్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు.

ఈ ట్వీట్‌ని బేస్ చేసుకొని విష్ణు, జ్వాలకు మ‌ధ్య ఏదో జరిగిందని రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. రూమర్లు అలా పాకుతూ విష్ణు విశాల్ వరకూ వెళ్లడంతో వెంటనే స్పందిస్తూ ..నేను మాట్లాడింది నా పర్సనల్ లైఫ్ గురించి ఏ మాత్రం కాదు. కేవలం ప్రొఫెషనల్ లైఫ్ గురించే ట్వీట్ చేశాను. మా ఇద్దరికి ఒకరిపై మరొకరికి చాలా నమ్మకం, ప్రేమ ఉంది అంటూ కామెంట్ చేశారు విష్ణు విశాల్.

Exit mobile version