HomecinemaVishal: విశాల్ షూటింగ్స్‌లోనే ఇలా వ‌రుస ప్ర‌మాదాలు.. లక్కీగా ప్రాణాలతో బ‌య‌ట‌పడ్డ హీరో

Vishal: విశాల్ షూటింగ్స్‌లోనే ఇలా వ‌రుస ప్ర‌మాదాలు.. లక్కీగా ప్రాణాలతో బ‌య‌ట‌పడ్డ హీరో

Telugu Flash News

Vishal: త‌మిళ హీరో విశాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌ని కూడా అడ‌పాద‌డ‌పా అల‌రిస్తూనే ఉన్నాడు. ఆయ‌న చేసిన చిత్రాలు తెలుగులో కూడా విడుద‌లై సందడి చేస్తుంటాయి. అయితే ఇటీవలి కాలంలో హీరో విశాల్‌ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు ఆయన ప్రమాదాల బారిన పడ‌గా,ఈ సారి ఏకంగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అనే చెప్పాలి. తన కొత్త సినిమా షూటింగ్‌లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

విశాల్‌ ప్రస్తుతం `మార్క్ ఆంటోని` చిత్రంలో నటిస్తుండ‌గా, అందులో ఒక‌ ట్రక్‌ అదుపు తప్పింది. సెట్‌లో కింద పడిపోయిన విశాల్‌ వైపు అదుపు తప్పి ట్రక్‌ వేగంగా దూసుకు వ‌స్తుండ‌డంతో అది గమనించిన టీమ్‌ మెంబర్స్ ఆయన్ని పక్కకి లాగారు. దీంతో విశాల్ ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే జరగరాని ఘోరం జరిగే ప్రమాదం జరిగి ఉండేది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, అంతా క్షేమంగానే ఉన్నారని తెలిపారు విశాల్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

also read :

health benefits of beans | బీన్స్‌ తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు..

Viral Video: పెళ్లిలో పన్నీర్‌ కోసం లొల్లి.. బుర్రలు పగిలేలా కొట్టుకున్నారు!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News