Virupaksha movie review : యాక్సిడెంట్ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నుండి వస్తున్న చిత్రం విరూపాక్ష. ఈ రోజు గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ , సంయుక్త మీనన్ జంటగా నటించారు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దర్శకుడిగా పరిచయం కాగా, SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌స్లే సమకూర్చడం ప్రత్యేక ఆకర్షణ. సినిమా టీజర్, ట్రైలర్ మూవీపై భారీ అంచనాలు పెంచడంతో ఈ సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. మరి తాజాగా విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
80, 90వ దశకంలో జరిగిన ఈ కథ ఇది. భయాన్ని కలిగించే సెటప్ మధ్య వయోలెన్స్ ఎక్కువగా ఉన్న సన్నివేశంతో ఈ చిత్రం పార్రంభం అవుతుంది. 1979 నేపథ్యంలో ఓపెన్ అయిన మూవీ మళ్ళీ 1991 కి మారుతుంది. రుద్రవరం అనే గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు ఎంతో భయానకంగా ఉంటాయి. సూర్య గా సాయి ధరమ్ తేజ్ , నందిని గా సంయుక్త మీనన్ కనిపిస్తారు. అయితే రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పద మృతిల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. చేతబడి వలన చనిపోతున్నారా లేక మరేదైన ఇతర కారణాల వలన చనిపోతున్నారా అనే మిస్టరీని సాయి తేజ్ చేదిస్తాడు. ఆ మిస్టరీ డెత్స్ వెనకాల ఎవరున్నారు? ఆ ఊరిని పట్టిపీడుస్తున్న శక్తి ఏంటి? హీరో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ ఊరుప్రజలకు ఎలాంటి విముక్తిని ఇచ్చాడు? హీరోలో ఉన్న పవర్స్ ఏంటనేది ఈ సినిమా కథగా చెప్పవచ్చు,
పర్‌ఫార్మెన్స్:
రూపంలేని కన్నును విరూపాక్ష (శివుడి మూడో కన్ను) అంటారని.. ఈ సినిమాలో రూపంలోని శక్తితో పోరాటం చేస్తారు కాబట్టి మూవీకి ‘విరూపాక్ష’ టైటిల్ పెట్టారు. సినిమాలో సూర్యగా సాయిధరమ్ తేజ్ చాలా కొత్తగా, ఫ్రెష్‌గా కనిపించాడు. ఆయన లుక్, యాక్టింగ్ స్టయిల్ కూడా కొత్తగా ఉంది. దర్శకుడు క్రియేట్ చేసిన పాత్రలో పూర్తిగా ఇన్‌వాల్వ్ అయి చేశాడు. చాలా సెటిల్డ్ గా నటించాడు. తేజూకి ఇది మంచి కమ్ బ్యాక్ మూవీ అని చెప్పాలి. ఇక నందినిగా కనిపించిన సంయుక్త మీనన్‌కి మంచి పాత్ర దక్కింది, ఆమె కూడా సినిమాకి ఓ పిల్లర్‌లా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రీ క్లైమాక్స్ లో ఇరగదీసింది. నటులు బ్రహ్మాజీ, సునీల్, రాజీవ్ కనకాల తమ పాత్రలకి న్యాయం చేశారు. అఘోరాగా నటుడు అజయ్ కూడా అలరించాడు.
ప్లస్ పాయింట్స్ష్:
నటీనటులు
బీజీఎం
స్క్రీన్‌ప్లే
మైనస్ పాయింట్స్:
క్లైమాక్స్
లవ్ స్టోరీ
కొన్ని సాగదీత సన్నివేశాలు
ఫైనల్‌గా:
ఓవరాల్‌గా చూస్తే విరూపాక్ష చిత్రంలో లవ్ స్టోరీ , క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేదనే అంశాలు తప్ప మిగిలినవి పాజిటివ్‌గానే ఉన్నాయి. ఇందులో సాయి ధరమ్ తేజ్ చాలా మెచ్యూర్డ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. అతనికి ఇదొక బౌన్స్ బ్యాక్ లాంటి సినిమా అవుతుందని, కెరీర్‌లో చెప్పుకునే చిత్రమవుతుందని చెప్పవచ్చు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ఈ మూవీ ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతుంది.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE