Telugu Flash News

Virat Kohli: పెళ్లి కోసం విరాట్ కోహ్లీ త‌న పేరుని ఏమ‌ని మార్చుకున్నాడో తెలుసా?

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. శతృదేశం పాకిస్థాన్‌లోనూ కోహ్లీ అంటే పడి చచ్చే అభిమానులు ఉన్నారంటేనే అతని క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. అనేక రికార్డుల‌ని చెరిపేసుకుంటూ ముందుకు సాగుతున్న విరాట్ కోహ్లీ త‌న కెరీర్‌లో అద్భుతాలు చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే…. ఆయ‌న బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబ‌ర్ 11,2022తో వారి వివాహా బంధానికి సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ ఐదేళ్లలో వారి బంధం ఎంతో బ‌ల‌ప‌డ‌గా, అంద‌రు సెలెబ్రిటీ కపుల్స్‌లా కాకుండా చాలా అన్యోన్యంగా ఉండే ఈ ఇద్దరూ.. చాలా మందికి స్పూర్తిదాయకంగా నిలిచారు.

2017 డిసెంబర్ 11న ఇటలీలోని ఓ విలాసవంతమైన రిసార్టులో విరాట్ కోహ్లీ తన ప్రియ సఖి అనుష్క శర్మకి తాళి క‌ట్టి త‌న అర్ధాంగిగా స్వీక‌రించాడు. పెళ్లికి భారత క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్స్‌ను కూడా ఈ వివాహానికి పిలవలేదు. వివాహం అనంతరం గ్రాండ్ రిసెప్షన్ పెట్టి అందర్నీ ఆహ్వానించ‌గా, అందుకు సంబంధించిన ఫొటోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇక వారి పెళ్లికి సంబంధించి తాజాగా ఓ విష‌యం నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది. పెళ్లి కోసం వారు పేర్లు కూడా మార్చుకున్నారట. ఈ విషయాన్ని అనుష్క శర్మనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

‘మేం పెళ్లి ఏర్పాట్లు చేసేటప్పుడు ఫేక్ నేమ్స్‌ని వాడాం. విరాట్ కోహ్లీ తన పేరును రాహుల్‌గా మార్చు కోగా.. నా పేరును ఐశ్వర్యగా మార్చుకున్నాను.’అని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. సదరు హోటల్ యాజమాన్యానికి కూడా జరగబోతున్నది భారత క్రికెట్ (ఇప్పుడు మాజీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పెళ్లి అని తెలియకుండా ఇలా వారు జాగ్రత్త పడ్డారట. కోహ్లీ పెళ్లి అని ప్రపంచానికి తెలిస్తే మీడియా, అభిమానుల హడావుడి ఎక్కువగా ఉంటుందని విరుష్క జోడీ ఈ నాటకం ఆడిందని తెలుస్తుంది. అభిమానుల హడావుడి ఎక్కువ‌గా ఉండవద్దనే క్రికెట్ ప్రభావం తక్కువగా ఉండే ఇటలీని తమ వివాహానికి వేదికగా ఎంచుకున్నామని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. వీరికి 2021 జనవరి 11న వామిక జన్మించింన విష‌యం తెలిసిందే.

Exit mobile version