Telugu Flash News

Virat Kohli: టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌నున్నాడా?

virat kohli retirement

Virat Kohli: టీమిండియా ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌పై అంద‌రిలో అనేక సందేహాలు నెలకొన్నాయి. కొద్ది రోజులుగా ఫామ్ లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న విరాట్ ఆసియా క‌ప్‌లో అద్భుతంగా రాణించి కింగ్ ఈజ్ బ్యాక్ అనేలా చేశాడు. ఆసియా కప్ లో కోహ్లీ ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో కలిపి మొత్తం 276 పరుగులు చేశాడు.

ముఖ్యంగా, ఆఫ్ఘనిస్థాన్ పై విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 61 బంతుల్లోనే 122 పరుగులు చేసి ఐసీసీలో త‌న ర్యాంక్ కూడా మెరుగుప‌ర‌చుకున్నాడు. టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తన 4వ ర్యాంకును పదిలం చేసుకోగా, విరాట్‌కి 15వ స్థానం ల‌భించింది. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్ర‌స్తుతం 14వ స్థానంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ రిటైర్ కానున్నాడా..!

గడిచిన మూడేండ్లలో మునపటి ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కున్న విరాట్ కోహ్లీ.. ఫామ్ లేమితో ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్నీ కోల్పోయాడు. ఈ క్రమంలో కోహ్లీని జ‌ట్టులో నుండి త‌ప్పిస్తార‌ని, ఆయ‌న త్వ‌ర‌లోనే రిటైర్మెంట్ కావ‌డం ఖాయ‌మ‌ని ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కోహ్లీ రిటైర్మెంట్‌పై స్పందించారు. కోహ్లీ రిటైరైతే బెటరని సూచించాడు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటిస్తే కోహ్లీకి మంచిద‌ని సలహా ఇచ్చాడు. కోహ్లీ ఒక ఛాంపియన్. అయితే అతడు ఇప్పుడు రిటైర్మెంట్ వైపు అడుగులు వేస్తాడ‌ని నేను నమ్ముతున్నాను..’ అని అన్నాడు.

ఇక దీనిపై మాట్లాడిన షోయ‌బ్ కూడా విరాట్ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత రిటైర్ అవుతాడ‌ని జోస్యాలు చెప్పాడు. దీంతో నెటిజ‌న్స్ ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా .. షాహిద్ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. నీకు (అఫ్రిది) మాదిరి రెండు సార్లు రిటైర్మెంట్ ప్రకటించరని చురకలంటించాడు.

కాగా, అఫ్రిది అంతర్జాతీయ కెరీర్ లో తొలుత ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించి.. మళ్లీ దానిని వెనక్కి తీసుకొని, ఆ తర్వాత కొద్దిరోజులు ఆడి మ‌ళ్లీ ఛాన్స్‌లు లేక రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

మరిన్ని వార్తలు చదవండి : 

Taapsee Pannu: జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్న‌కి కోపంతో ఊగిపోయిన తాప్సీ.. అంత కోప‌మెందుకు అమ్మ‌డు అంటున్న నెటిజ‌న్స్

Nagarjuna: స‌మంత,నాగ చైత‌న్య విడాకుల‌పై స్పందించిన నాగార్జున‌.. సామ్ వెళ్లిపోవ‌డం దుర‌దృష్ట‌కరం..!

Asad Rauf Dead: క్రికెట్‌లో విషాదం.. పాపుల‌ర్ అంపైర్ అసద్ రవూఫ్ హ‌ఠాన్మ‌ర‌ణం

 

Exit mobile version