HomesportsVirat Kohli: పాకిస్తాన్ మ్యాచ్‌తో మ‌ళ్లీ రేసులోకి వ‌చ్చిన కోహ్లీ..మూడో స్థానానికి ప‌డిపోయిన సూర్య స్థానం

Virat Kohli: పాకిస్తాన్ మ్యాచ్‌తో మ‌ళ్లీ రేసులోకి వ‌చ్చిన కోహ్లీ..మూడో స్థానానికి ప‌డిపోయిన సూర్య స్థానం

Telugu Flash News

ఇటీవ‌ల పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సునామి ఇన్నింగ్స్ ఆడ‌డంతో ఇప్పుడు ఆయ‌న ఖాతాలో అనేక రికార్డులు వ‌చ్చి చేరుతున్నాయి. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో కింగ్ కోహ్లీ దుమ్మురేపాడు.

పాక్పై ఆడిన ఇన్నింగ్స్…కోహ్లీని ఏకంగా టాప్ 10లో నిలబెట్టేలా చేసిది. ఆసియాకప్ సమయంలో 35 వ స్థానంలో ఉన్న కోహ్లీ..టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్తో టాప్ -10లోకి రావ‌డంతో అభిమానులు కింగ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. . ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో కోహ్లీ 9వ స్థానంలో నిలవడం విశేషం.

ఏకైక బ్యాట్స్‌మెన్

గతంలో అగ్రస్థానంలో ఉన్న విరాట్.. తర్వాత ఫామ్ కోల్పోయి ఎన్ని ఇబ్బందులు ప‌డ్డాడో మ‌నం చూశాం.. 2021 వరల్డ్ కప్‌లో ఆకట్టుకోలేకపోయిన కోహ్లి.. గతేడాది నవంబర్‌లో టాప్-10లో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు.. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి ఆరంభంలో టాప్-10లోకి రాగా, మ‌ళ్లీ పేలవ ప్రదర్శనతో మళ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతడి స్థానం దిగజారింది.

virat kohliఆసియా కప్‌కు ముందు 4 అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కేవ‌లం 81 ప‌రుగులు మాత్రమే చేశాడు. ఆసియా కప్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విరాట్.. అప్ఘాన్‌తో మ్యాచ్‌లో శతకం బాది స‌త్తా చాటాడు.

ఇక పాకిస్తాన్ మ్యాచ్‌లో విరాట్ ఎంత విధ్వంసం సృష్టించాడో మ‌నం చూశాం. దీంతో బుధవారం రిలీజైన ర్యాంకింగ్స్‌ లిస్టులో కోహ్లీ తొమ్మిదవ స్థానంలో నిలిచాడు.

పాకిస్థాన్‌ క్రికెటర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ ప్రస్తుతం టీ20 బ్యాటర్స్‌ లిస్టులో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండ‌గా, ఆస్ట్రేలియాపై 92 రన్స్‌ చేసిన న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే రెండవ స్థానాన్ని ద‌క్కించుకున్నాడు.

-Advertisement-

సూర్యకుమార్ యాదవ్ (828 పాయింట్లు) మూడో స్థానంలో ఉండగా బాబర్ ఆజమ్ 799 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

వన్డేల విషయానికి వస్తే పాక్ కెప్టెన్ బాబర్ తొలి స్థానంలో ద‌క్కించుకోగా, కోహ్లి 7వ స్థానంలో, రోహిత్ శర్మ 8వ స్థానంలో కొన‌సాగుతున్నారు.

భారత్ తరఫున టీ20, వన్డేల్లో (రెండింట్లోనూ) టాప్-10 బ్యాటర్ల జాబితాలో ఉన్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లి కావడంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు చదవండి :

Puri Jagannath: పూరీ జ‌గ‌న్నాథ్‌కి ప్రాణ హాని ఉందా.. లైగర్ డైరెక్ట‌ర్ పోలీస్ కంప్లైంట్‌

Vitamin B12 deficiency: విటమిన్ B12 లోపం యొక్క లక్షణాలు ఏమిటి? ఎలా చికిత్స చేయాలి? విటమిన్ B12 సమృద్ధిగా ఉన్న ఉత్తమ ఆహారాలు ఏంటి ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News