Telugu Flash News

Virat Kohli: విరాట్ లేకుండా భార‌త్ వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌దు.. ఇంజమామ్ ఉల్ హ‌క్ స్ట‌న్నింగ్ కామెంట్స్

Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఒక‌ప్పుడు భార‌త కెప్టెన్. అనేక ప‌రిస్థితుల న‌డుమ ఆయ‌న తన కెప్టెన్సీని వ‌దులుకోవ‌ల్సి వ‌చ్చింది. అంతేకాదు స‌రైన ప్ర‌ద‌ర్శ‌న చూప‌ని కార‌ణంగా విరాట్ ఎన్నో అవ‌మ‌నాలు ఎదుర్కొన్నాడు.

ఒకానొక ప‌రిస్థితిలో విరాట్ జ‌ట్టులో ఉంటాడా లేదా అనిపించింది. అలాంటి ప‌రిస్థితుల‌లోనే టీ 20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో స్థానం సంపాదించిన విరాట్ పాకిస్తాన్‌పై అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడి ఇన్నాళ్లు త‌న‌ని విమ‌ర్శించిన వారంద‌రి నోళ్లు మూయించాడు. మెల్‌బోర్న్‌లో తిరుగులేని మొనగాడిగా విరాట్ అద్భుత విజయాన్నందించాడు.

విరాట్ కోహ్లీ (Virat Kohli) పై ప్ర‌శంస‌లు

31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా నడిచిన జట్టును విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్‌తో విజయం వైపు నడిపించి శ‌భాష్ అనిపించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

హార్దిక్ ఔటైనా.. కడవరకు క్రీజులో నిల్చొని విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇప్పుడు విరాట్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. తాజాగా పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ విరాట్ కోహ్లీపై ప్ర‌శంస‌లు కురిపించాడు.

ఒకే ఒక్క విష‌యంలో భార‌త జ‌ట్టు ప్ర‌మాద‌క‌రంగా క‌నిపిస్తుంది. చాలా మంది కొంద‌రు బ్యాట్స్‌మెన్స్ ప్ర‌మాద‌క‌రం అని చెబుతుంటారు. నావ‌ర‌కు వ‌స్తే అది విరాట్‌. అత‌ను జ‌బ‌ర్ధ‌స్త్ ఆట‌గాడు. భారత్‌ ప్రపంచకప్‌ గెలవాలంటే విరాట్‌ ఈ తరహా ఆటతీరుతో ప్రపంచకప్‌ గెలుచుకోవచ్చు.

విరాట్ లేకుండా ప్రపంచకప్ గెలవగలమని వారు భావిస్తే, అది అసాధ్యం కాదు, ”అని ఇంజమామ్ ఉల్ హ‌క్ తన యూట్యూబ్ ఛానెల్ ది మ్యాచ్ విన్నర్‌లో చెప్పుకొచ్చాడు.

కొంతమంది ఆటగాళ్ళు పరుగులు చేసినప్పటికీ మ్యాచ్‌లను గెలిపించలేరు. కానీ కొంతమంది ఆటగాళ్ళు తమ జట్టు కోసం ఒంటరిగా ఆడి ఒత్తిడిలో అలాంటి మ్యాచ్‌లను గెలిపిస్తారు. విరాట్ కోహ్లీ అటువంటి ఆటగాడు . అత‌ని బ్యాటింగ్ స్టైల్ వేరు అని ఇంజమామ్ ఉల్ హ‌క్ అన్నాడు.

ఇవి కూడా చూడండి :

బ్రిటన్‌ ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్‌..తన ప్రస్థానమిదే

Cancer Causing Foods: ఈ 7 ఆహారాలు క్యాన్సర్ కారకాలు

 

Exit mobile version