ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ (t20 world cup 2022) జరుగుతుండగా, ఇటీవల భారత్.. పాకిస్తాన్‌తో ఫస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక్కడే అత్యుత్తమ ప్రదర్శన కనబరచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 6.1 ఓవర్లలో 31 పరుగులకే 4 వికెట్లు నష్టపోయిన జట్టుకు ఊహించిన రీతిలో విజయాన్ని అందించాడు కోహ్లీ.
జట్టు 20 ఓవర్లలో 160 పరుగులు చేసిందంటే కోహ్లి వీరోచిత పోరాటమే కారణం. హార్దిక్ పాండ్యతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన కోహ్లి.. 12వ ఓవర్లో తొలి సిక్స్ బాదాడు. ఓ దశలో 34 బంతుల్లో 33 పరుగులతో వన్డే తరహాలో ఆడిన విరాట్.. మ్యాచ్ చివరికి వచ్చే సరికి ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
t20 world cup 2022 లో నిరూపించుకోవల్సిన టైం…
తాజాగా 1983 ప్రపంచ కప్ విజేత సభ్యుడు మదన్ లాల్ మాట్లాడుతూ ‘మెన్ ఇన్ బ్లూ’ కేవలం ఒకరిద్దరు ఆటగాళ్ల పర్‌ఫార్మెన్స్‌పై ఆధారపడక తప్పదు. పాకిస్తాన్‌పై కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.
“విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంది. ఇలాంటి ఇన్నింగ్స్ నేను ఎప్పుడూ చూడలేదు కానీ విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్‌ని గెలిపించలేడు. ఇది చాలా పెద్ద టోర్నమెంట్. ఒక వ్యక్తి గెలిపించడం కష్టం” అని లాల్ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు .
“కోహ్లి ఆటకు ఆస్ట్రేలియా పిచ్‌లు సరిపోతాయి. ఇవి పెద్ద మైదానాలు కావడంతో సింగిల్స్,డబుల్స్ ఎక్కువగా తీస్తాడు. మధ్యలో బౌండరీలు కొడతాడు. రోహిత్ శర్మ మరియు కెఎల్ రాహుల్ తమ ఆటతీరు మెరుగుపరచుకోవాలి.
ఇండియా ఛాలెంజెస్ ముందు ముందు ఉంది. నెదర్లాండ్స్ లాంటి జట్లు కూడా బలహీన జట్లు కావు. ప్రతి మ్యాచ్ ముందు ప్రత్యర్థులను బట్టి తమ ప్లేయింగ్ XIని ఎంచుకోవాలి. తమ పేసర్లను, స్పిన్నర్లను తదనుగుణంగా ఆడించాలి. రిషబ్ పంత్ తప్పనిసరిగా ప్లేయింగ్ XIలో కనిపిస్తాడని లాల్ చెప్పాడు.
పంత్ తప్పక ఆడాలి. అతను మ్యాచ్ విన్నర్. అతనికి ఐదు-ఆరు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వాలి . టీ20 క్రికెట్‌లో స్పష్టమైన ఫేవరెట్‌లు లేవు. దక్షిణాఫ్రికా మంచి జట్టే. స్వదేశంలో ఆస్ట్రేలియా బలీయంగా ఉంది. శ్రీలంక కూడా రాణిస్తోంది.
ఇంగ్లండ్, న్యూజిలాండ్ కూడా అద్భుతంగా రాణించాయి. కానీ ఖచ్చితంగా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మరియు ఇంగ్లండ్‌లతో పాటు ఇండియా టాప్4లో ఉంటుంది అని మదన్ లాల్ అన్నారు.”
ఇవి కూడా చదవండి :
bigg boss 6: బిగ్ బాస్ షో లో తొలిసారి గీతూ ఏడ్చేసింది.. అసలేం జరిగింది ?
horoscope today: అక్టోబర్ 26, బుధవారం ఈ రోజు రాశి ఫలాలు 2022