Virat Kohli: ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్ టోర్నీ రంజుగా సాగుతున్న విషయం తెలిసిందే. సెమీస్ కోసం అన్ని జట్లు చాలా కష్టపడ్డాయి. ఇందులో కొన్ని జట్లు సెమీస్ కి చేరగా, మరి కొన్ని ఇంటిబాట పట్టాయి.గ్రూప్ ఏలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీస్‌కి చేరుకోగా, గ్రూప్ బీలో ఏయే జట్లు సెమీస్‌కి చేరబోతాయనే దానిపై నేడు క్లారిటీ రానుంఇ. అయితే భారత్ చివరి మ్యాచ్ బంగ్లాతో ఆడిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ లిట్టన్ దాస్ 27 బంతుల్లో 60 పరుగులు చేసి ఇండియాకి చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓడిపోయినప్పటికీ లిట్టన్ దాస్ ఆట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
ప్రతిభను మెచ్చి..
ఈ క్రమంలోనే భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లిట్టన్ దాస్ కు బ్యాట్ బహుమతిగా ఇచ్చాడు.ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ జలాల్ యూనస్ స్పష్టం చేశారు. “మేము డైనింగ్ హాల్‌లో కూర్చున్నప్పుడు, విరాట్ కోహ్లీ వచ్చి లిట్టన్‌కు బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. నా ప్రకారం, ఇది లిట్టన్‌కు స్ఫూర్తినిస్తుంది. లిట్టన్ క్లాస్ బ్యాటర్, అతను క్లాసికల్ షాట్లు ఆడటం మేము చూశాము. అతను ఒక టెస్టులు,వన్డేలలో అద్భుతమైన ఆటగాడు. ఇటీవల, అతను టీ20లలో కూడా బాగా ఆడటం ప్రారంభించాడు” అని యూనస్ చెప్పుకొచ్చాడు.
ఇక కొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమతం అయిన కోహ్లీ ఇప్పుడు టీ 20 వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. పాకిస్తాన్‌పై మెమోరబుల్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ శ్రీలంక మాజీ ఆటగాడు మహేల జయవర్ధనేని అధిగమించి, టీ 20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగుల చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డ్ సృష్టించాడు.ఈ టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ మూడు అర్ధశతకాలు సాధించడం విశేషం. ఇక ఈ రోజు భారత్ ఆదివారం జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే నేరుగా సెమీస్ కు వెళ్తుంది.
also read :
Vishwak Sen: విశ్వక్ సేన్‌పై అర్జున్ విమర్శలు.. ఈ కుర్ర హీరో వర్షెన్ ఇది..!