Kohli: ఇటీవల ఆసియా కప్‌లో దారుణంగా నిరాశ పరచిన భారత జట్టు మరి కొద్ది రోజులలో టీ 20 వరల్డ్ కప్ ఆడబోతుంది.అయితే అంతకముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో కొన్ని మ్యాచ్‌లు ఆడనుంది.
ఈ క్రమంలో ఆసీస్‌తో నేటి నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆటగాళ్లు తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. మధ్యమధ్యలో స్టెప్పులు కూడా వేస్తూ సందడి చేస్తున్నారు.
తాజాగా కోహ్లీ, హార్ధిక్ పాండ్యా ప్రాక్టీస్ మధ్య ‘సే అకాబో’ అనే రీమిక్స్ పాటకు స్టెప్పులేశారు. ఓ డిఫెరెంట్ స్టెప్ ఇద్దరు అనుకరిస్తూ చేయగా, ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది.
టైం పాస్..
ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ ఇలా డ్యాన్స్ చేయడం చాలా ముచ్చటగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కోహ్లీతో పాటు పలువురు ఆటగాళ్లు ఇలా సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక ఇరు జట్లు మొహాలీలో ప్రాక్టీస్ సెషన్లలో నిమగ్నమయ్యాయి.
ఆస్ట్రేలియా పేసర్లు సంధించే బౌన్సర్లను సమర్థంగా ఎదుర్కొవడమే లక్ష్యంగా బ్యాట్స్‌మెన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కోహ్లీ అయితే పుల్ షాట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ట్విట్టర్లో పోస్టు చేయగా, ఇది ఆకట్టుకుంది.
ఆసీస్ వర్సెస్ భారత్ మధ్య తొలి టీ20మ్యాచ్ మొహాలిలో జరగనుండగా.. రెండోది నాగ్‌పూర్ (శుక్రవారం), మూడోది హైదరాబాద్ (ఆదివారం) వేదికగా జరగనున్న విషయం తెలిసిందే .
టీ20 ప్రపంచకప్‌నకు ముందు బ్యాటింగ్, బౌలింగ్ సమతూకం చేసుకోవడానికి ఇది మంచి ప్రాక్టీస్ మ్యాచ్‌గా మారనుంది. సీనియర్ పేసర్ బుమ్రా, యువ బౌలర్ హర్షల్ పటేల్ కూడా జట్టులోకి రావడంతో బౌలింగ్ విభాగాం కాస్త పటిష్టంగానే కనిపిస్తుంది.
ఆస్ట్రేలియాతో సిరీస్లో బరిలోకి దిగే భారత జట్టు విషయానికి వస్తే :
టాపార్డర్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ,
మిడిలార్డర్ : సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్),
ఫినిషర్లు : దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా,
స్పిన్నర్లు : ఆర్.అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్,
పేసర్లు : భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.
You know how we do 😎 @imVkohli pic.twitter.com/YAJVUB5bYP
— hardik pandya (@hardikpandya7) September 18, 2022