Viral Video : ఆడవాళ్లంటే అందరికీ చీరలు, నగలు, మేకప్.. ఇలా రకరకాల ఇష్టాలు ఉంటాయి. ఇష్టంగా ఉన్నంత వరకు ఏ సమస్యా రాదు. అయితే, ఏదైనా శృతి మించితేనే సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి.
పండుగుల సందర్భంగా చాలా కంపెనీలు, వస్త్ర దుకాణాలు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలో ఆడవాళ్లు చీరలు, నగలు కొనడానికి ఎగబడుతుంటారు. ఇలాంటి నేపథ్యంలోనే సిల్క్ చీరల డిస్కౌంట్ సేల్స్ షోరూమ్‌లో ఓ చీర కోసం ఇద్దరు ఆడవాళ్లు సిగపట్లు పట్టారు. జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
చీరలంటే ఏ మహిళకు ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. అయితే, వాటిని కట్టే పరిస్థితి ఉందా? లేదా? అనేది అప్రస్తుతం. బెంగళూరు నగరంలోని మల్లేశ్వరంలో ఓ వస్త్రదుకాణం నిర్వాహకులు ఏటా వేసవిలో మైసూర్ సిల్క్ శారీస్‌తో పాటు పట్టు చీరలు, విలువైన చీరలు డిస్కౌంట్‌లో అందిస్తుంటారు.
ఇందుకోసం డిస్కౌంట్ సేల్స్ పేరిట మల్లేశ్వరంలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు చేరుకున్నారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా డిస్కౌంట్ సేల్స్ విక్రయాలు కొనసాగాయి. బెంగళూరు నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు వచ్చారు.
ఈ క్రమంలోనే ఓ చీర చాలా అట్రాక్టివ్‌గా కనిపించింది. దీంతో ఇద్దరు మహిళలు ఒకేసారి దానిపై కన్నేశారు. అప్పుడే అసలు గొడవ మొదలైంది. చీరకోసం ఇద్దరూ గొడవ మొదలు పెట్టారు. ఆ చీరను తాను ముందు చూశానంటే.. లేదు నేనే ముందు చూశానంటూ ఇరువురూ వాదోపవాదాలు చేసుకున్నారు.
ఇద్దరి మధ్య వాదన పెరిగింది. సహనం కోల్పోయిన ఇరువురూ.. ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని ముష్టి యుద్ధానికి దిగారు. ఇలా చీర కోసం ఇద్దరు మహిళలు వీధికెక్కి సిగపట్లు పట్టడం అక్కడి వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక పరిస్థితిని అదుపు చేసేందుకు సెక్యూరిటీ ప్రయత్నించారు. అనంతరం ఇద్దరు మహిళలకు సర్ది చెప్పి చెరోవైపు పంపారు సెక్యూరిటీ సిబ్బంది. ఇదే సమయంలో ఇక్కడి పరిస్థితిని అంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
చీరల కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళల వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆడవారికి నచ్చిన వస్తువుల విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే ఇక వారి పని ఖతం అయిపోయినట్లేనంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram