Telugu Flash News

Viral video: ఔరా.. ఏం ధైర్యం? పులిని చేతులతో పట్టుకొస్తున్న మహిళ..!

viral videos

Viral video : మహిళా శక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నేటి కాలంలో అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. పురుషులతో పాటే ఉద్యోగాలు, వ్యాపారాలు, అన్నింటా సగం భాగంగా తన శక్తిని చాటుతోంది మహిళ.

ఇటీవల లండన్‌ కాలేజ్‌ ఆఫ్‌ యూనివర్సిటీ వారు చేసిన అధ్యయనంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా కష్టపడుతున్నారని తేలింది. శ్రమైక శక్తి మహిళలదేనంటూ ఆ అధ్యయనం తేల్చింది. ధైర్య సాహసాల్లోనూ మగువను మించిన వారు ఈ సృష్టిలోనే లేరని అనేకసార్లు రుజువైంది.

తాజాగా పులిని చేతులతో ఎత్తుకొని వస్తున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఔరా ఈ మహిళకెంత గుండె ధైర్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు. కేవలం 10 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓవైపు పులి అరుస్తోంది. కానీ రెండు చేతులతో దాన్ని బంధించిన మహిళ.. కుక్క పిల్లను ఎత్తుకెళ్లినట్లుగా తీసుకెళ్తోంది. పులిని చేతులతో ఎత్తుకొని వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఆ మహిళను ఓ మేడ పై నుంచి ఎవరో వీడియో తీశారు. ఆమె చేతుల నుంచి విడిపించుకోవడానికి పులి గాండ్రిస్తూ తెగ ప్రయత్నాలు చేస్తోంది.

గంటల్లోనే వీడియో వైరల్‌..

ఈ నేపథ్యంలో వీడియో వైరల్‌గా అయ్యింది. తాను ఈ వీడియో చూసి షాక్‌కు గురయ్యానంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు. వండర్‌ ఉమెన్‌ మూవీ మళ్లీ తీస్తున్నారా? అంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశాడు. ఆ పులి కష్టాల్లో పడింది.. ఎవరైనా అది పులేనని నాకు చెప్పండి.. అంటూ ఇంకో యూజర్‌ కామెంట్‌ సెక్షన్‌లో పేర్కొన్నాడు. ఇలా అనేక కామెంట్లతో వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. కువైట్‌లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఇన్‌ స్టా గ్రామ్‌లో ఈ వీడియోకు 20 గంటల్లోనే వేలాది లైక్స్‌, కామెంట్స్‌ హోరెత్తాయి.

Also Read: 

TDP in Telangana: ఉత్తర తెలంగాణపై టీడీపీ నజర్‌.. ప్లాన్‌ ఏంటి ?

Hyderabad:మ‌ళ్లీ హైదరాబాద్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్.. టిక్కెట్స్ ఎప్పుడు, ఎలా పొందాలంటే..!

Exit mobile version