Viral Video today : వివాహాలు ఈ మధ్య కాస్త వెరైటీగా జరుగుతున్నాయి. ఎంగేజ్‌మెంట్లు, పెళ్లిళ్లను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటూనే కొందరు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో వివిధ పద్ధతులను అనుసరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా జరిగిన ఓ ఇన్సిడెంట్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎంగేజ్ మెంట్ అంటే ఎవరైనా ఏం చేస్తారు? తాంబూలాలు మార్చుకొని పెద్దల సమక్షంలో పెళ్లి ముహూర్తం ఖాయం చేసుకొని బట్టలు అందించుకుంటారు. పూలు, పండ్లు ఒకరివి మరొకరు ఇచ్చి పుచ్చుకుంటారు.
పెద్దల మాటలు పూర్తయ్యాక కాబోయే వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకుంటారు. తర్వాత ఫొటోలను పోజులిస్తుంటారు. ఇదీ.. తెలుగు సంప్రదాయం ప్రకారం జరిగే నిశ్చితార్థ వేడుక. ఈ క్రమంలో ఈ వీడియోలో జంట చేసిన పనికి ఇప్పుడు నెటిజన్లు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. రొటీన్‌గా చేసుకుంటే కిక్కేముంది అనుకున్నారో ఏమో.. వీరిద్దరూ కాస్త భిన్నంగా ట్రై చేశారు.
ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో కాబోయే వధూవరులు స్టేజీపై ఉన్నారు. ఈ సమయంలో ముందు భాగంలో బంధువులు, మిత్రులంతా కలిసి కూర్చున్నారు. కీలక ఘట్టం రాగానే వీరిద్దరూ ఉంగరాలు మార్చుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే ఓ పెద్ద రింగ్ కదులుతూ వచ్చింది. కాసేపు అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఓ టేబుల్‌పై పెద్ద రింగ్ కదులుతూ స్టేజి వద్దకు చేరుకుంది.
సస్పెన్స్ వీడిందిలా..
టేబుల్‌పై పెద్ద రింగ్ ఉంది. ఇంత పెద్ద రింగును ఏం చేసుకుంటారబ్బా.. అని అందరూ గుసగుసలాడుకున్నారు. ఇంతలో వధూవరుల వద్దకు చేరుకున్న ఆ టేబుల్, రింగులో నుంచి రెండు ఉంగరాలు కాబోయే వధూవరులిద్దరూ తీసుకున్నారు. తర్వాత ఒకరికి ఒకరు ఉంగరాలు మార్చుకున్నారు. అప్పటిదాకా ఉన్న సస్పెన్స్ వీడటంతో అందరూ రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లారు. వీరి సరికొత్త ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఊహించని విధంగా వైరల్‌గా మారడంతో జంట తెగ సంబరపడిపోతున్నారు.
also read:
cold remedies : ఆయుర్వేద చిట్కాలతో జలుబు, దగ్గుకు పరిష్కారం.. ఇలా ట్రై చేయండి!
Anant Ambani – Radhika Merchant engagement photos.. Celebrities Attends..
World Coldest City : ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశం.. ఎక్కడో తెలుసా? ఏడాది పొడవునా మైనస్ డిగ్రీలే!