Viral Video Today : సాధారణంగా ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రయాణంలో రైలు, బస్సులను ఆశ్రయిస్తుంటారు. సొంతంగా కారున్న వారు అందులో జర్నీలు చేస్తుంటారు. మరికొందరు బస్సులు, కార్లు అద్దెకు తీసుకొని కూడా ప్రయాణాలు చేస్తుంటారు. అయితే, ప్రజా రవాణా వ్యవస్థలో కొండచరియలు, ఎత్తైన ప్రదేశాల్లో ప్రయాణం చేసే వారు భయపడుతుంటారు. ఇలాంటి జర్నీలు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంటుంది.
కానీ నిత్యం ఇలాగే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అచ్చం ఇలాంటి జర్నీ చేసే ప్రాంతాన్నీ ఈ వీడియోలో చూడొచ్చు. ఇది నేపాల్‌లోని ఓ కొండ ప్రాంతం. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ అంటే లైఫ్ రిస్క్ చేసి జర్నీ చేయాల్సిందే. ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందో తెలియదు.. కానీ జర్నీ మాత్రం రెగ్యులర్‌గా చేయాల్సిందే.
ఇటీవలే నేపాల్‌లో విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తంగా 72 మంది దుర్మరణం చెందారు. అయితే, ప్రమాదం ఎలా జరిగిందనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ ఘటనకు వాతావరణం కారణం కాదని, సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. నేపాల్‌లో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఘాట్ రోడ్లు కూడా అధికంగా ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి.
రోడ్లు, వంతెనలపై అవతలివైపుకు చేరుకోవడం కష్టతరంగా మారుతుంటుంది. ఇలాంటి సమయాల్లోనే ప్రమాదాలు చోటు చేసుకొని చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతుంటారు. దాదాపు ఇలాంటి డేంజర్ జర్నీనే ఈ వీడియోలో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఏకంగా వాహనానికే తాడు కట్టి లోయను దాటించారు. అక్కడ బ్రిడ్జి సౌకర్యం లేదు. రెండు వైపులా జనం నిలబడి ఉన్నారు. రోప్ వే ద్వారా వాహనాలను లోయ దాటిస్తున్నారు. వాహనానికి కట్టిన తాడు పొరపాటున తెగిపోతే పరిస్థితి ఏంటనేది ఆలోచించాల్సిన విషయమే.
Public transport in Nepal 🇳🇵
— Erik Solheim (@ErikSolheim) January 21, 2023
also read news:
Rishi Sunak : బ్రిటన్ భద్రంగా ఉండాలంటే రిషి నాయకత్వమే ఉండాలి.. ప్రజల విశ్వాసం చూరగొన్న రిషి!
undavalli arun kumar : పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి? ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు!