viral video today : చదువు కోసం, ఉద్యోగాల కోసం, సంసార బాధ్యతల కోసం పిల్లలు విదేశాలకు వెళ్లిపోతుంటారు. ఈ సమయంలో తల్లిదండ్రులు వారితో ఫోన్లోనే మాట్లాడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఫంక్షన్ల సమయంలో ఒక్కోసారి వారు లేకపోవడం తీరని వెలితిగా మిగిలిపోతుంటుంది. ఈ తరుణంలో పిల్లలను మిస్ అవుతున్నామని తల్లిదండ్రలు, సోదరులను, సోదరీమణులను మిస్ అవుతుంటామని ఇక్కడున్న వారు బాధపడుతుంటారు.
కానీ కుటుంబమే మొదటి ప్రాధాన్యమని రుజువు చేస్తూ ఇక్కడ ఓ కుమార్తె ఏకంగా విదేశాల నుంచి రెక్కలు కట్టుకొని వాలిపోయింది. తన సోదరుడి వివాహానికి హాజరు కాలేకపోయాననే బాధ జీవితాంతం వేధించకుండా ఉండటం కోసం ఆమె తాపత్రయపడింది. ఈ దృశ్యాన్ని వీడియో తీసిన బంధువులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లు ప్రశంసలందుకుంటోంది. కుటుంబానికి ఆమె ఇచ్చిన ప్రాధాన్యంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంత దూరాన ఉన్నా కుటుంబాన్ని మరువరాదనే సందేశాన్ని ఆ కూతురు ఇచ్చిందని అందరూ మెచ్చుకుంటున్నారు. శ్రద్ధా షెలార్ అనే మహిళ తన ఫ్యామిలీతో సహా యూకేలో నివాసం ఉంటోంది. తాజాగా తన తమ్ముడి పెళ్లి కుదిరింది. కానీ ఈ ఫంక్షన్‌కు ఆమె అటెండ్ కాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. అయితే, ఊహించని ట్విస్ట్ ఇస్తూ ఆమె ఫంక్షన్‌కు హాజరైంది.
అరుదైన సందర్భాలను మిస్ కావొద్దు..
దీంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులులేకుండా పోయాయి. సడన్‌గా ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో అందరూ ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. కుటుంబ సభ్యులంతా ఆమెను హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. అరుదైన సందర్భం మిస్ కావొద్దంటూ నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్లు చేస్తున్నారు. వీడియో పెట్టిన కొన్ని గంటల్లోనే ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Also Read :
nara lokesh padayatra : లోకేష్ పాదయాత్రకు అనుమతి.. పోలీసుల కండీషన్లు ఇవే..!
Sharwanand : శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా ?
Uttar Pradesh : యూపీలో ఇద్దరు యువతుల ప్రేమ కథ.. ట్విస్టులు మామూలుగా లేవు !
niharika konidela : తల్లి కాబోతున్న నిహారిక… అందుకే అజ్ఞాతంలోకి వెళ్లిందా..!