Telugu Flash News

Viral Video: నెటిజ‌న్స్ ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న ఎరుపు రంగు న‌ది.. ఎక్కడ ? ఎందుకిలా ?

Viral Video: నదులంటే సహజంగా ప్రశాంతతకు, ఆహ్లాదానికి మారుపేరుగా చెప్పుకుంటూ ఉంటాం. నదీతీరాల్లో కాస్సేపు కూర్చుని సాయం వేళల్లో సేద తీరాలని కూడా అనుకుంటాం. అయితే కొన్ని న‌దులు మ‌న‌ల్ని భ‌య‌పెడ‌తాయి. మ‌రి కొన్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.

మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోలో పెరూ న‌ది ఎరుపు రంగులో ప్ర‌వ‌హిస్తుంది. ఇది పాత వీడియో అయిన‌ప్ప‌టికీ ఎప్ప‌టిక‌ప్పుడు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంది. దక్షిణ అమెరికా ఖండంలోని లోయ గుండా ఈ నది ప్రవహిస్తున్నట్లు వీడియోలో క‌నిపిస్తుంది.

అద్భుతం..

దీనిని స్థానికంగా Pukamayu అని పిలుస్తారు. క్వెచువా భాషలో ఎరుపు నది అని అర్దం. నేల కోత కారణంగా ఏర్పడిన మట్టి యొక్క వివిధ పొరలలో ఉండే ఖనిజ నిక్షేపాల కారణంగా నది ఎర్ర‌గా మారిన‌ట్టు చెబుతున్నారు.

పర్వతాల ప్రాంతం నుండి వచ్చే ఐరన్ ఆక్సైడ్ కారణంగా రంగు ప్రత్యేకంగా ఉంటుంది. వర్షపు నీరు ప్రవహించి న‌దిలో క‌ల‌వ‌డం వల్ల ఇది ఎరుపు రంగులోకి మారుతుంది.

వర్షాకాలంలో మాత్రమే ఇది ఎర్ర‌గా కనిపిస్తుంది. మిగిలిన స‌మయంలో, నీటి ప్రవాహం పెద్ద‌గా ఉండ‌దు కాబ‌ట్టి ఇందులో నీరు గోధుమ రంగులో ఉంటుంది.

ఈ వీడియో సోమవారం షేర్ చేయ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు 2.7 మిలియన్ల కి పైగా వ్యూస్ 51,000 లైక్‌లను సంపాదించింది. ఈ వీడియోని చూసి నమ్మల‌క‌పోతున్నాం అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

“నేను దీన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను” అని మరొక వ్యక్తి తెలిపాడు. మ‌రో వ్య‌క్తి.. “సినిమా దర్శకులు ఈ స్థలాన్ని పెద్ద రక్తపాత యుద్ధం జరిగే సన్నివేశంగా ఉపయోగించుకోవ‌చ్చు అని తెలిపాడు.

read more news :

మందారంతో జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్.

Intermittent Fasting : ఈ డైట్ వల్ల మహిళల్లో సంతానోత్పత్తి సమస్య.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

Exit mobile version