Telugu Flash News

viral video: పాండా ప్ర‌య‌త్నం విఫ‌లం.. బొక్క‌బోర్లా ప‌డిందిగా..!

viral video: సోష‌ల్ మీడియాలో నిత్యం జంతువుల‌కి సంబంధించి చాలా వీడియోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి.ఇవి యానిమ‌ల్ ల‌వ‌ర్స్‌కి మంచి వినోదాన్ని పంచుతుంటాయి. ముఖ్యంగా మనుషులతో కొన్ని జంతువులు ప్రవర్తించే తీరు నవ్వులు తెప్పిస్తుంటాయి.

మనం పెంచుకునే కుక్కలు, పిల్లులు, కోతులు మనపై చెప్పలేనంత అభిమానాన్ని చూపింంచ‌డం వ‌ల‌న మ‌నం వాటితో బాండింగ్ అలా పెంచుకుంటూ పోతాం. అయితే సోష‌ల్ మీడియాలో కొన్ని జంతువుల వీడియోలు తెగ వైర‌ల్ అవుతుండ‌గా, అందులో పాండాల‌కి సంబంధించిన వీడియోలు తెగ ఆకర్షిస్తుంటాయి.

భ‌లే ప‌నైందిగా..

జంతువులు సాధార‌ణంగా ఖాళీ స‌మ‌యంలో విచిత్ర ఆట‌లు ఆడుతుంటాయి. ఒక్కోసారి ఆట‌లు ఆడే క్ర‌మంలో గాయాల పాలు కూడా అవుతుంటాయి. అయితే ఇవి చేసే కొన్ని ప‌నులు ఫ‌న్నీగా ఉండ‌డంతో పాటు న‌వ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా పాండా జంప్ చేసే క్ర‌మంలో కింద ప‌డింది.

పాండా దాని ఎదురుగా ఉన్న‌ బ్యాగ్‌పైకి దూకడానికి జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంది, కానీ బదులుగా అది వ‌ర్క‌వుట్ కాక నేలపై పడిపోతుంది. ఈ వీడియోను బ్యూటెంగేబిడెన్ అనే నెటిజ‌న్స్ శుక్రవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “ది టైమింగ్ ఆఫ్ ఎ పాండా, అనే క్యాప్ష‌న్ ఇచ్చారు.

వీడియో అప్‌లోడ్ చేసినప్పటి నుండి 3.9 మిలియన్లకు పైగా వ్యూస్ మరియు లక్షకు పైగా లైక్‌లను పొందింది. అందమైన జంతువు నేలపై పడిపోవడం పట్ల నెటిజ‌న్స్ విచారం వ్య‌క్తం చేశారు. “అవి అడవిలో ఎలా జీవిస్తాయో నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు.

మ‌రో నెటిజ‌న్ పాండాలు చాలా తెలివైన‌వి మరియు ప్రేమగలవి అంటూ మ‌రో నెటిజన్ అన్నాడు.

ఇటీవ‌ల ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన మగ పాండా కు పశువైద్యులు కారుణ్య మరణాన్ని ప్రసాదించారు. సుదీర్ఘ‌కాలం పాటు జీవించిన మ‌గ పాండా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న నేప‌థ్యంలో దాని ప‌రిస్థితి చూసి కారుణ్య మ‌ర‌ణం అందించారు. మరింత బాధపడకుండా ఉండేందుకు ఓషన్ పార్క్ పశువైద్యులుఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇవి కూడా చూడండి :

Lifestyle Changes can prevent acid reflux ?

ముఖంపై నల్ల మచ్చలు పోవాలంటే.

 

 

Exit mobile version