Telugu Flash News

Viral video : ఆ చిన్నారి స్మైల్ కి ఇంటర్నెట్ ఫిదా !

Viral video : చిన్నారులను అద్దం ముందు నిలబెడితే వారు చేసే పనులు అంతాఇంతా కాదు. కొందరు డాన్స్ చేస్తే.. ఇంకొందరు యాక్టింగ్ చేస్తూ.. మనల్ని నవ్విస్తుంటారు. మీరు డిస్ని యానిమేషన్ మూవీ ఫ్రొజెన్ చూశారా.. అందులో ఎల్సా అనే అమ్మాయి ఉంటుంది. ఈ చిత్రం పై పిల్లలకున్న క్రేజ్ మీకు తెలిసే ఉంటుంది . ఫ్రొజెన్ లంచ్‌బాక్స్‌ల నుండి స్కూల్ బ్యాగ్‌ల వరకు, పిల్లలు ప్రతిసారీ తమ బొమ్మలను చాలా చక్కగా ప్రదర్శిస్తూ ఉంటారు.

ఇప్పుడు, ఒక చిన్నారి నీలిరంగు ఫ్రోజెన్ గౌను ధరించి ఉన్న వీడియో వైరల్ గా మారింది.

మొదటిసారిగా ఆ దుస్తులను ధరించడం మరియు ఆ చిన్నారి అద్దంలో చూసుకున్నప్పుడు, తన రియాక్షన్ సూపర్బ్.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ స్మాల్ స్టెప్స్ షేర్ చేశారు. ఈ వీడియో కి 9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఆ చిన్నారి తండ్రి ఆమెను గౌనులో అలంకరించిన తర్వాత ఆమెను అద్దం ముందు ఉంచడం మీరు చూడవచ్చు. చిన్నారి అద్దం వైపు చూసి వెంటనే నవ్వి “వావ్” అంటుంది. అప్పుడు ఆమె తండ్రి, “అది ఎల్సా నా ?” అని అడుగుతాడు. అప్పుడు ఆ పాప అద్దంలో తనను తాను బాగా చూసుకుని, నవ్వుతూనే ఉంటుంది . ఆ చిన్నారి స్మైల్ కి ఇంటర్నెట్ ఫిదా అయ్యింది.

ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. మీరు చూసేయండి మరి.. కామెంట్స్ బాక్స్ లో “లవ్లీ” మరియు “బ్యూటిఫుల్ ” వంటి పదాలతో నిండిపోయింది.

Exit mobile version