Telugu Flash News

Viral Video: గ్లాస్ ఆక్టోపస్ చూసి మెస్మ‌రైజ్ అవుతున్న నెటిజ‌న్స్..

Viral Video: సముద్రంలో అనేక రకాల జీవులుంటాయి అనే సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వాటిల్లో ఆక్టోపస్‌లు ఒకటి. అయితే ఈ ఆక్టోపస్ లు ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 జాతులు ఉన్నాయి. ఇవి ఆకారంలోనే కాదు జీవితంలో కూడా భిన్నంగా ఉంటాయి. ఆడ ఆక్టోపస్‌లు గుడ్లు పెట్టిన అనంతరం ఆత్మహాత్య చేసుకుంటాయ‌ట‌.

తమ పిల్లలని తమ జీవితంలో ఒక్కసారి కూడా చూడలేవు. వెన్నెముక లేకుండా హాయిగా జీవించే ఆక్టోపస్‌లలో గ్లాస్ ఆక్టోప‌స్ అంద‌రిని ఆక‌ర్షిస్తుంటుంది. ఇది ఉపఉష్ణమండల జలాల్లో చాలా అరుదుగా కనిపించే సెఫలోపాడ్. ఈ అందమైన జీవులు సూర్యకాంతి చేరని లోతైన సముద్రంలో కనిపిస్తాయి.

క్యూట్ ఆక్టోప‌స్..

తాజాగా గ్లాక్ ఆక్టోప‌స్‌కి చెందిన వీడియోని ట్విట్టర్‌లో ‘ది ఆక్సిజన్ ప్రాజెక్ట్’ షేర్ చేసింది . గ్లాస్ ఆక్టోపస్ దాని పేరు మాదిరిగానే పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది. దాని కళ్ళు, కంటి నాడి మరియు జీర్ణవ్యవస్థ మాత్రమే అపారదర్శకంగా ఉంటాయి.

ఈ వీడియోకు 20వేలకు పైగా వ్యూస్ మరియు 440 లైక్‌లు వచ్చాయి. అరుదైన, మర్మమైన జీవి అందాలను చూసి నెటిజన్లు పూర్తిగా మంత్రముగ్ధులయ్యారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం, గ్లాస్ ఆక్టోపస్‌లు 1918 వరకు కనుగొనబడలేదు. ఈ జీవులు సుమారు 2-5 సంవత్సరాలు జీవిస్తాయి.

సాధార‌ణంగా ఆక్టోపస్‌ల నాడీ వ్యవస్థ కాస్త పెద్దదిగా ఉంటుంది. సగటున ఒక్కో ఆక్టోపస్‌లో 50 కోట్ల నాడీ కణాలు లేదా మెదడు కణాలు ఉంటాయట‌. శునకాలు, మనుషులు, ఇతర జీవులకు భిన్నంగా ఆక్టోపస్‌లలో ఎక్కువ నాడీకణాలు ఉంటాయ‌ట‌. ఆక్టోపస్ టెంటక్స్‌లోని ప్రతి బొడిపె మీద దాదాపు 10,000 నాడీకణాలు ఉంటాయ‌ని, ఇవి స్పర్శ, రుచికి తోడ్పడతాయని అంటుంటారు.

ఇవి కూడా చూడండి :

చలికాలం పొడిచర్మం ఇబ్బందా..ఈ చిట్కాలు మీ కోసమే

రాత్రిపూట తలస్నానం చేస్తే..నష్టమా ? లాభమా ?

Exit mobile version