Viral video : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, స్కూల్ బస్సులు, ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు సైతం ఉదయం పూట చాలా రద్దీగా కనిపిస్తాయి. ఒక్కోసారి ప్రయాణికుల సంఖ్య ఎక్కువైన సందర్భాల్లో బస్సు టాప్ పైకి ఎక్కి చాలా మంది ప్రమాదకర ప్రయాణాలు చేస్తుంటారు. పాఠశాలలకు, కార్యాలయాలకు సమయం మించిపోతోందనే సాకుతోనో, మరో బస్సు కోసం వేచి చూసే ఓపిక లేకనో బస్సులు ఫుల్‌గా జనంతో నిండిపోయినా ఇరుక్కొని డోర్ల వద్ద, బస్సు టాప్‌పై ప్రయాణాలు చేస్తుంటారు. కొన్ని సమయాల్లో బస్సుల సంఖ్య తక్కువగా ఉండటం కూడా ఇందుకు కారణం అవుతుంటుంది.
ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాల బారిన పడుతుంటారు. బస్సుల్లో ఇలా డేంజరస్ ప్రయాణాల వల్ల ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు, యువత క్రేజీగా ప్రయాణించాలనే కోరికతో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరోవైపు బస్సుల నిర్వాహకులు సైతం తమకు ఆదాయమే పరమావధిగా సురక్షిత ప్రయాణాలను అటకెక్కిస్తున్నారు. ప్రాణాలు పోతేపోనీ.. తమకు ఆదాయం వస్తోందన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇలాంటి ఉదంతమే పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. పరిమిత స్థాయి కంటే ఎక్కువగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. నడి రోడ్డుపై ఉన్నట్టుండి అదుపు తప్పింది. ఒక్కసారిగా రోడ్డు పక్కన పడిపోయింది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బుర్డ్‌వాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒక్కసారిగా పడిపోయిన బస్సు
రోడ్డుపై అప్పటికే అధిక లోడ్ కారణంగా ఊగుతూ ప్రయాణించింది ఆ బస్సు. ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా వెనక నుంచి ఎవరో తోసేసినట్లుగా సైడ్‌కి పడిపోయింది. ఈ ఘటనలో బస్సు టాప్‌పైన ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా కిందపడిపోయారు. కొందరు బస్సు వాలిపోతుండగానే దూకేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి బస్సు కింద పడి నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. బస్సులోపల ప్రయాణిస్తున్న వారికీ చాలా మందికి గాయాలయ్యాయి. ఓవర్‌లోడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వీడియో అక్కడే సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్‌గా మారింది.
#WATCH :Shocking bus accident in #Bengal caught on cctv camera. Initial details suggest one dead & many injured. Incident happened on Ketugram Katua road in East Burdwan. Locals & police rescued the passengers,rushed injured to hospital. Overspeeding bus lost control & overturned pic.twitter.com/YGca8XSkdM
— Tamal Saha (@Tamal0401) January 8, 2023
also read:
TDP – Janasena : ఏపీలో ఆ రెండు పార్టీల పొత్తు ఖాయమా? పవన్ కల్యాణ్ ప్లాన్ ఏంటి?