Viral Video today : చిన్న కష్టం వస్తేనే చాలా మంది తట్టుకోలేకపోతుంటారు. నాకే ఎందుకీ కష్టాలు అంటూ నిత్యం స్మరించుకుంటుంటారు. కష్టాలను ఫేస్ చేయడానికి చాలా మంది ఇష్టపడరు. జీవింతంలో అనుకోని కష్టాలు అందరికీ వస్తుంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ముందుకు వెళ్లడమే మనం చేయాల్సిన కర్తవ్యం. అలాంటిది కష్టాన్ని చూసి పారిపోతే ఇక ఈ జీవితానికి అర్థం పరమార్థం ఉండవు.
మనకు ఎదురయ్యే ప్రతి కష్టం జీవితంలో ఏదో నేర్పాలని ప్రయత్నిస్తుందనే విషయం చాలా మందికి తెలియక.. కష్టాలు ఎదురైనప్పుడు భయపడుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది తమకు వచ్చిన చిన్నపాటి కష్టాలకే ఆత్మహత్యల వరకు వెళ్లిపోతుంటారు. మరికొందరు నా బతుకింతే అనుకొని డీలా పడిపోతుంటారు. ఇంకొందరు తాగుడుకో, డ్రగ్స్‌కో బానిసలు అవుతుంటారు. తాజాగా ఓ దివ్యాంగుడు తన లోపాన్ని అధిగమించి కష్టానికే భయం పుట్టేలా చేశాడు.
నెట్టింట వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఒక వ్యక్తి రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అతనికి ప్రమాదవశాత్తూ ఓ కాలు పోయింది. కానీ, అతడు ఆత్మస్థైర్యాన్ని వీడలేదు. తన సామర్థ్యం ముందు వైకల్యాన్ని ఓడేలా చేశాడు. ఒంటి కాలితోనే రిక్షా నడుపుతూ తన సత్తా చాటుతున్నాడు. ఊతకర్ర సాయంతో రిక్షాపై బరువులు పెట్టుకొని లాగేస్తున్నాడు. ఎత్తు ప్రదేశాల్ని కూడా లెక్కచేయకుండా వైకల్యమో తానో తేల్చుకోవాలంటూ పట్టు పడుతున్నాడు.
ఈ క్రమంలో విజయవంతం అవుతూ.. అవయవాలు బాగున్నా పని చేయలేక సాకులు చెప్పే ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతడి ధైర్యానికి హాట్యాఫ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందరికో స్పూర్తివంతంగా నిలుస్తున్నాడంటూ మెచ్చుకుంటున్నారు.
जीना है गर कुछ प्रयास तो करना होगा
स्वर्ग देखना है तो खुद को मारना होगाhttps://t.co/PwsFvru9b7 pic.twitter.com/PLzGJd3YdG— Aamir Khan ₚₐᵣₒdy (@AamirKhanfa) January 17, 2023
also read:
MP Komatireddy Venkat Reddy : కేసీఆర్ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లే చాన్స్.. పార్టీని సిద్ధం చేయండి!
Google Layoffs : గూగుల్ కీలక నిర్ణయం.. 12 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటన