HomecinemaViral Video : రన్‌బీర్‌ కపూర్‌ మరో అమ్మాయితో షేక్‌ హ్యాండ్‌.. ఆలియా భట్‌ జెలసీ ఫీలింగ్‌ చూశారా!

Viral Video : రన్‌బీర్‌ కపూర్‌ మరో అమ్మాయితో షేక్‌ హ్యాండ్‌.. ఆలియా భట్‌ జెలసీ ఫీలింగ్‌ చూశారా!

Telugu Flash News

Viral Video : బాలీవుడ్‌ జంట్‌ ఆలియా భట్‌, హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాల సందర్భంగా ప్రేమాయణం నడిపిన వీరు.. అనంతరం ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటయ్యారు. వీరికి పండంటి పాప కూడా జన్మించింది. కరోనా నేపథ్యంలో వీరి వివాహం నిరాడంబరంగా సాగింది. పెళ్లయిన రెండు నెలలకే ఆలియా భట్‌ శుభవార్త చెప్పింది. అయితే, పెళ్లికి ముందే తాను గర్భం దాల్చానని ఇటీవల సంచలన విషయం వెల్లడించింది ఆలియా భట్‌.

అటు సినిమాల్లోనూ వీరిద్దరూ దూసుకెళ్తున్నారు. బ్రహ్మాస్త్ర మూవీ సందర్భంగా వీరు లవ్‌ ట్రాక్‌ నడిపారని తెలుస్తోంది. ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో నవంబర్ 6న పాపకు జన్మనిచ్చారు ఆలియా భట్. తాజాగా వీరిద్దరూ ఓ క్రీడా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో పాల్గొన్న వీరిద్దరూ స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రేక్షకులందరూ మ్యాచ్‌తో పాటు వీరిని ఆసక్తిగా తిలకించారు.

ముంబైలో జరిగిన ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టుకు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ మద్దతు ఇచ్చారు. అయితే, మ్యాచ్‌ సందర్భంగా ఆలియా భట్‌ వ్యవహరించిన తీరు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. స్టేడియంలో కూర్చొని మ్యాచ్‌ను వీక్షిస్తుండగా మరో అమ్మాయి వచ్చి రణ్‌బీర్‌ కపూర్‌తో షేక్‌ హ్యాండ్‌ ఇస్తుంది. ఈ సమయంలో పక్కనే ఉన్న ఆలియా భట్‌ ఒకింత జలసీగా ఫీల్‌ అవుతుంది. కెమెరాలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది.

ఆలియా యూ జలస్‌ రే..

ఈ నేపథ్యంలో నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. పెళ్లవగానే ఆలియాకు ఎంత జలసీ వచ్చింది చూశారా? అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మగువే మరో మగువకు శత్రువంటూ కామెంట్లు పెడుతున్నారు మరికొందరు. ఇలా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. చాలా మంది షేర్‌ చేస్తూ లైక్‌ చేస్తున్నారు. మహిళలూ జాగ్రత్త.. మీ హస్బెండ్‌ మరో అమ్మాయి కంట పడ్డారో ఇక అంతే సంగతులంటూ కొందరు జాగ్రత్తలు చెబుతున్నారు.

also read:

-Advertisement-

Somesh Kumar : సోమేష్‌ కుమార్‌ ఎపిసోడ్‌.. రాజకీయ దుమారానికి కారణం అదేనా?

Amaravati : ఏపీ రాజధానిపై సుప్రీం కోర్టులో కీలక పరిణామం.. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం ఏమందంటే..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News