Homeviral newsViral Video: ప‌దివేల అడుగుల ఎత్తులో బ‌ర్గ‌ర్ తిన్న మ‌హిళ‌.. త‌ర్వాత ఏమైందంటే..!

Viral Video: ప‌దివేల అడుగుల ఎత్తులో బ‌ర్గ‌ర్ తిన్న మ‌హిళ‌.. త‌ర్వాత ఏమైందంటే..!

Telugu Flash News

Viral Video: మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక మార్పులు జ‌రుగుతుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ఏదైన అద్భుతాలు చేయాలంటే పురుషుల‌తో పాటు మహిళ‌లు కూడా ముందుకు వ‌స్తున్నారు. ఎలాంటి క‌ష్ట‌మైన ప‌ని అయిన స‌రే వారు రంగంలోకి దిగి స‌త్తా చాటుతున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా మ‌హిళ‌ల గొప్ప‌త‌నాల‌కు సంబంధించిన వీడియోలు నిత్యం తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఇందులో కొన్ని సీరియ‌స్‌గా ఉండ‌గా, మ‌రి కొన్ని మాత్రం ఫ‌న్నీగా అనిపిస్తుంటాయి.

భ‌యపెట్టించిందిగా..

ఇంకొన్ని భయం పుట్టించే సన్నివేశాలు అయితే.. వాటిని చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఇటీవల ఓ యువతి చేసిన సిల్లీ ధైర్య సాహసానికి సంబంధించిన వీడియో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇంత‌కు ఈ వీడియోలో ఏముంది అంటే..ఆ యువ‌తి స్కై డైవింగ్ చేస్తూ గాల్లోనే బర్గర్ తినడం మీరు చూడొచ్చు. స్కై డైవింగ్ చేసేవారిలో చాలామంది భయపడుతూ ఉంటారు కానీ ఈ మహిళ మాత్రం ఎలాంటి భయం లేకుండా బర్గర్ తింటూ.. తెగ ఎంజాయ్ చేస్తూ క‌నిపించింది.

ఈ వీడియోపై నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. 10, 000 పైగా అడుగుల ఎత్తులో ఇలాంటి ధైర్యసహసాలు చేస్తూ ఇంత కూల్‌గా ఎలా ఉండ‌గ‌లిగారు అంటూ కొంద‌రు స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ యువ‌తి పేరు మెక్కెన్నా నిప్ కాగా, ఆమె చేసిన ధైర్య సాహసాన్ని గాను ఈ సన్నివేశాలను ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోని 7000 మంది లైక్ చేయ‌గా, కామెంట్ల వ‌ర్షం కురుస్తూనే ఉంది. గ‌తంలో కూడా ఈమె ఇలాంటి వీడయోల‌తో నెటిజ‌న్స్‌కి మంచి వినోద‌మే పంచింది.

 

 

View this post on Instagram

 

A post shared by Mckenna Knipe (@mckennaknipe)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News