Viral Video : మల్లెపూలు జడలో పెట్టుకోవడం హిందూ సంప్రదాయంలో ఓ భాగం. జడలో పూలు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. హిందూ సంప్రదాయాలకు విదేశీయులు సైతం అనేకమార్లు మంత్రముగ్ధులవుతుంటారు. అందుకే మన కట్టు, బొట్టు, వేషధారణ చేసుకుంటూ ఇక్కడి సంస్కృతిని వారి దేశాల్లోనూ చాటి చెబుతుంటారు. ఈ క్రమంలో అనేక మంది విదేశీయులు భారత సంప్రదాయాలను గౌరవిస్తుంటారు.
తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఓ ట్రావెల్ మహిళా జర్నలిస్టు భారత్‌కు వచ్చింది. ఆమె పేరు అలెక్స్ ఔట్‌వేట్. భారత పర్యటనలో భాగంగా ఓ అద్భుతమైన అనుభవాన్ని చవిచూసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఈ ముద్దుగుమ్మ.. తమిళనాడుకు వెళ్లింది. అక్కడ మరపురాని మధురానుభూతిని పొందింది. మార్కెట్ వద్దకు వెళ్లిన ఈ తెల్లపిల్లకు.. అక్కడ మల్లెపూలు అమ్ముతున్న ఓ మహిళ పిలిచింది.
తనవద్ద కూర్చోబెట్టుకొని.. తెల్లటి పిల్లవు.. మల్లెపూలు శిగలో పెడితే మరింత అందం నీ సొంతమవుతుందంటూ ఆమెకు పల్లెపూలు పెట్టింది. అలెక్స్ ఔట్‌వేట్ ఈ మల్లెపూల అనుభవాన్ని ఆస్వాదించింది. ఈ సందర్భంగా మల్లెపూలు పెట్టిన మహిళ.. చిరునవ్వుతో పలకరించింది. ఎంత సక్కగున్నవే తెల్లపిల్లా.. మల్లెపూలు పెట్టుకొని… అంటూ పరవశించిపోయింది. ఈ ఘటనను తెల్లపిల్ల మిత్రులు వీడియో తీశారు. తాజాగా ఈ వీడియోను యూకే జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
దీంతో తమిళ మహిళ, యూకే జర్నలిస్టు సంభాషణ, వారి మధ్య ఆప్యాయతపై నెట్టింట ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అనతికాలంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా యూకే జర్నలిస్టు తమిళనాడు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. నెటిజన్లు ఈ వీడియోను ఆదరిస్తున్నారు. కామెంట్లతో అభినందనలు తెలుపుతున్నారు. అతిథిదేవో భవ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. విదేశాలకు చెందిన నెటిజన్లు సైతం.. భారతీయులు అన్ని వేళలా స్నేహపూర్వకంగా మసలుకుంటారంటూ కామెంట్ చేశారు.
also read :
Palamuru-RangaReddy Project : పాలమూరుకు పచ్చజెండా.. సుప్రీం కండిషన్లు ఇవే!
Andhra Pradesh: జగన్‌కు బాబు హెచ్చరిక.. అడ్డుకోవడంపై ఆగ్రహం!