Viral Video: దొంగలను పట్టుకోవల్సిన పోలీసులే ఇటీవల దొంగలుగా మారి అవాక్కయ్యేలా చేస్తున్నారు. కొందరు పోలీసులు దొంగతనాలు చేస్తూ సీసీ కెమెరాల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. అయితే వారిని సస్పెండ్ చేసిన కూడా కొందరిలో మార్పు రావడం లేదు. ప్రజలకు రక్షణ ఉండాల్సిన రక్షకభటులే దొంగతనాలకు పాల్పడుతుండడం ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇందులో ఒక పోలీసు అధికారి బల్బును దొంగిలించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
పోలీస్ దొంగ
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో సదరు పోలీసు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం ఉన్నతాధికారుల దాకా వెళ్లడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. వివరాల్లోకి వెళితే దసరా నవరాత్రుల సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో కొద్దిరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా, రాజేశ్ వర్మ అనే పోలీస్ కానిస్టేబుల్ కు నైట్ డ్యూటీ వేశారు. అయితే ఆ సమయంలో మెల్లగా ఓ షాపు దగ్గరకు నడుచుకూంటూ వెళ్లి ఎల్‌ఈడీ విద్యుత్ బల్బు తీసుకుని జేబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
బల్బ్ మిస్ కావడంతో షాపు యజమాని సీసీ కెమెరాలో ఈ విషయాన్ని గమనించాడు. అయితే ఒక కానిస్టేబుల్ బల్బు ఎత్తుకుపోవడం చూసి అవాక్కయ్యాడు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడంతో కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం వీడియో కూడా చక్కర్లు కొడుతుంది. కానిస్టేబుల్ ప్రవర్తనపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇక్కడ కానిస్టేబుల్ వర్షెన్ మరోలా ఉంది. తనకు విధులు కేటాయించిన ప్లేస్‌లో చీకటి ఉన్న నేపథ్యంలో షాపు బల్బ్ తీసి అక్కడ పెట్టినట్టు చెబుతున్నాడు.
प्रयागराज में गश्त पर निकले दरोगा जी ने पहले इधर-उधर देखा फिर LED बल्ब निकालकर जेब में रख लिया
अगर LED की जगह 100w का बल्ब होता तो दरोगा जी की हिम्मत नहीं होती..गरम-गरम जेब में रखने की 😜 pic.twitter.com/JkpPmhmO9i
— Ravi Kumar (@ravi_nsui) October 15, 2022