Viral video : తొమ్మిది మంది పిల్లలను ఒకే సైకిల్‌పై ఎక్కించుకుని వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిన్న క్లిప్‌ను జైకీ యాదవ్ అనే యూజర్ ట్విట్టర్‌లో పంచుకున్నారు, “ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరుకుంది, అందుకే ఇలాంటివి ఇకపై ఎక్కువ కనిపిస్తాయి”.
వీడియోలో, ఒక వ్యక్తి సైకిల్‌పై తొమ్మిది మంది పిల్లలను తీసుకువెళుతున్నాడు. ముగ్గురు పిల్లలు వెనుక కూర్చొని ఉండగా, వాళ్లలో ఒకరు మిగతావాళ్లపై నిలబడి ఆ వ్యక్తి భుజాలు పట్టుకుని కనిపించారు. ఇద్దరు పిల్లలు ముందు బార్‌పై కూర్చున్నారు, ఇంకొకరు చక్రం పైన సైకిల్ తొక్కుతున్న వ్యక్తికి ఎదురుగా కూర్చున్నాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు ఆ వ్యక్తి చేతుల్లో ఉన్నారు, సైకిల్ తొక్కినంతసేపు అతనిని పట్టుకున్నారు. అయితే అతను సైకిల్ తొక్కుతున్నంతసేపు అందులో ఎవరు కూడా భయపడకుండా వీడియో వైపు అమాయకంగా చూస్తున్న పిల్లలను చూసి నెటిజన్లు మరింత అబ్బురపడ్డారు.
ఈ క్లిప్ మంగళవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడింది అయితే అప్పటి నుండి ఇది 216,000 కంటే ఎక్కువ వీక్షణలను మరియు 7,200 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించుకుంది. అయితే ఈ పోస్ట్ యూజర్లు ఒక్కక్కరు ఒక్కో విధంగా స్పందించారు. కొందరు సరదాగా అతని పిల్లలేనా అని కామెంట్లు చేస్తే మరికొందరు ఇటువంటి వారి వల్లే జనాభా పెరుగుతుందని కామెంటు చేసారు.
आज दुनिया की आबादी 8 अरब हो गई, इस उपलब्धि को हासिल करने में ऐसे इंसानों को बहुत बड़ा योगदान रहा है👇 pic.twitter.com/Fiq62o0OiK
— Jaiky Yadav (@JaikyYadav16) November 15, 2022
అయితే కొంతమంది మాత్రం భిన్నంగా ఆ వ్యక్తి వైపు నుండి ఆలోచించే ప్రయత్నం చేసారు “బహుశా అందరు అతని పిల్లలు కాకపోవచ్చు” అని కొందరు అంటే మరికొందరు “వారికి రవాణా సౌకర్యం లేకపోయి ఉండచ్చు అందుకే ఇలా ప్రయాణించాల్సి వచ్చింది” అంటూ ఆ వ్యక్తి చర్యను సమర్ధించారు. అది దేనికైనా సంబంధించిన వీడియో అయ్యి ఉండచ్చు అని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు పిల్లలతో ఇటువంటి రిస్కులు ఎందుకని హెచ్చరించారు. ఏది ఏమైనా సరదాగా అయినా ఇటువంటి పరిమితికి మించిన ప్రయాణాలు సురక్షితం కాదు అయితే ఇక్కడ ఈ వీడియో ఈ ప్రదేశానికి చెందినదో తెలియకపోవడం గమనార్హం.
also read news:
కొత్త సెలక్షన్ కమిటీ ..టీమిండియా జట్టులో పలు మార్పులు.!
ఈ పచ్చడి కళ్లకు ఎంతో మేలు.. ఇంకెందుకు ఆలస్యం.. మీరు చేసుకోండి..