Telugu Flash News

Viral Video : సింహాన్నే ఫూల్‌ చేశాడు.. బొమ్మలా నిలబడి ఏం చేశాడో చూడండి!

viral videos

Viral Video : వన్యప్రాణులుండే ప్రాంతాలకు వెళ్లిన సందర్భాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అజాగ్రత్తగా ఉంటే ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి సందర్భాల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా కొన్ని సార్లు చాలా మంది ప్రమాదాలకు దగ్గరగా వెళ్లి చివరకు క్షేమంగా తిరిగి బయటపడుతుంటారు. జంతు ప్రదర్శన శాలల్లో క్రూర మృగాలతో కొందరు చెలగాటం ఆడుతుంటారు. 

ఇలాంటి సందర్భాల్లో ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఈ తరహా ఘటనలు కూడా చాలా జరిగాయి. ఇలా కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్‌ అయ్యింది. ఓ వ్యక్తి సింహం బారి నుంచి తప్పించుకొనేందుకు చాకచక్యంగా వ్యవహరిస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సింహాన్ని ఇలా కూడా ఫూల్‌ చేస్తారా? అని కామెంట్లు పెడుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో సింహానికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. ఓ జంగిల్‌ సఫారీ పార్క్‌లో కొందరు వాహనాలపై వెళ్తూ వన్య ప్రాణులను తిలకిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఓ వ్యక్తి ఓపెన్‌ టాప్‌ జీపు ఎక్కి ముందువైపు ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని ఉంటాడు. అక్కడి అందాలను, పక్షులను, జంతువులను చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంటాడు. ఉన్నట్టుండి ఓ సింహం అక్కడికి వస్తుంది. దీంతో వాహనంలోని అందరూ ఒక్కసారిగా భయపడతారు. అయితే, సింహానికి దగ్గరగా ఉన్న ఆ వ్యక్తి తెలివి ప్రదర్శిస్తాడు. ప్రాణాలకు తెగించి అలాగే కూర్చుండిపోతాడు.

ఇక అతని వద్దకు వచ్చిన సింహం కూడా చాలా సేపు అతడిని చూస్తూ ఉండిపోతుంది. అయితే, అతడు మాత్రం బొమ్మలాగా కదలకుండా అలాగే ఉండిపోతాడు. ఈ క్రమంలో అతడిని కాసేపు గమనించిన తర్వాత బొమ్మ అనుకొని సింహం వెనుదిరిగిపోతుంది. ఈ దృశ్యాన్నంతా జీపులో ఉన్న వారు వీడియో తీశారు. దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. సింహాన్ని భలే బోల్తా కొట్టించాడంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఇలాంటి స్టంట్లు చాలా ప్రమాదకరమని, సింహం ఏ మాత్రం చొరవ తీసుకొని అటాక్‌ చేసినా అతడి ప్రాణాలు దక్కేవి కాదని కామెంట్లు పెడుతున్నారు.

also read :

Manchu Family : రోడ్డున ప‌డ్డ మంచు ఫ్యామిలీ గొడవ.. స్పందించిన మంచు విష్ణు

MLC 2023 : ఎమ్మెల్సీ గెలుపుతో టీడీపీకి బూస్ట్‌.. నేతల చేరికలు షురూ! 

Exit mobile version