Viral Video : కరోనా వైరస్ భయాలతో విధించిన లాక్‌డౌన్లు చాలా మంది జీవితాలను నాశనం చేశాయి. ఈ మహమ్మారి వల్ల అమలు చేసిన లాక్ డౌన్ల కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. దాని బారి నుంచి ఇప్పుడిప్పుడే జనం కోలుకుంటున్నారు. ఈనేపథ్యంలో చైనాలోని షాంఘైలో ఉన్న ఒక రెస్టారెంట్ కెమెరాల్లో చక్కటి వీడియో ఫుటేజ్ రికార్డు అయింది.
అది హృదయాన్ని కదిలించేలా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
షాంఘైలోని వాంగ్ రెస్టారెంట్ కిచెన్ రూమ్ అది. ఆర్డర్స్ లేవనే బాధలో రెస్టారెంట్ యజమాని వాంగ్ ఏదో ఆలోచిస్తూ కూర్చున్న చోటే నిద్రలోకి జారుకున్నాడు.
సరిగ్గా ఇదే సమయంలో వాంగ్ చిట్టి కుమార్తె తన కోటును తీసి.. తండ్రి వీపుపై కప్పింది. చిట్టి కూతురి చేష్టలు చూసిన ఆ తండ్రి కన్నీరు మున్నీరు అయ్యాడు. దీంతో చిట్టి కూతురు తన తండ్రిని ఓదార్చింది.
ఈ హృద్యమైన వీడియోను వాంగ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. చైనాలో కరోనా లాక్ డౌన్లు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో వాంగ్ లా ఎంతోమంది రెస్టారెంట్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోయారు.
సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ వీడియో .. మొదట వెబ్‌సైట్ “న్యూస్‌ఫ్లేర్”లో కనిపించింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఐదు గంటల్లోనే 1.3 మిలియన్ల వీక్షణలు , 90k+ లైక్‌లను అందుకుంది.
ఈ వీడియోను చూసి స్పందించి ఎంతోమంది నెటిజన్స్ కామెంట్స్ చేశారు. “ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది? నేను వెళ్లి అతనికి కొంత వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను. మేము వారికి ఎలా మద్దతు ఇవ్వగలం?” అని అడుగుతూ ఒక వినియోగదారు అన్నారు.
“బలమైన కుటుంబంలో ఇలాగే ఒకరినొకరు చూసుకుంటారు” అని ఇంకొందరు పేర్కొన్నారు. “విరామం తీసుకోండి, మీరు ఆమె కోసం పనిచేస్తున్నారని కుమార్తె కు తెలుసు” అని మరొకరు కామెంట్స్ చేశారు.
” తల్లిదండ్రుల కష్టాన్ని, తపనను అర్ధం చేసుకునే పిల్లలను చూడటం చాలా హృదయపూర్వకంగా ఉంటుంది” అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.
also read news:
Cricketers: ఒకే రోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు క్రికెటర్స్.. అదీ సిరీస్ మధ్యలో…!