Telugu Flash News

Viral Video: పెద్దాయన ఐడియాకి ఫిదా.. సైకిల్‌ను కూలింగ్‌గా మార్చేశాడు..!

Viral Video: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఎటు చూసినా ఉక్కపోత, వేడితో ప్రజలు అల్లాడుతున్నారు. వయసుడిగిన వారి కష్టాలు అయితే వర్ణనాతీతం అయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తుండడం కాస్త ఉపశమనం కలిగించే అంశంగా మారింది. ఎండకు తాళలేక చాలా మంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎండకు ఎండిపోవడం, ఉక్కపోత భరించడానికి బదులుగా కాస్త రిలీఫ్‌ ఇచ్చే ఐడియాలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ పెద్దాయన చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఎంత పెద్ద సమస్యకైనా చక్కటి పరిష్కారాలు ఉంటాయి. కొందరు తెలివిగా ఇలా చేస్తుంటారు. అందుబాటులో ఉన్న వస్తువులను.. తమ సమస్యలకు పరిష్కారాలుగా వాడుకుంటూ నలుగురిలో ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్‌ చల్‌ చేస్తుంటాయి. ప్రస్తుతం ఓ వృద్ధుడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

లక్షలు ఖర్చు పెట్టి కార్లు కొనలేక.. మరోవైపు ఎండలను భరించలేక చివరకు వెరైటీ ప్లాన్ వేశాడు ఈ పెద్దాయన. తన సైకిల్‌ను ఎలా మార్చేశాడో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎండల దాటికి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు జనం. డబ్బున్నవారు ఏసీలు కొనుగోలు చేస్తూ, లేదా కార్లలో ఏసీలు వేసుకొని వెళ్తుంటారు. స్తోమత లేని వారు గోనెసంచులు, పట్టాల సాయంతో చల్లబరుచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

ఓ వృద్ధుడు తనకున్న సైకిల్‌పై వెళ్తూనే ఎండ, వర్షం బారి నుంచి ఈజీగా తప్పించుకుంటున్నాడు. అతడి ఐడియాకు నెటిజన్లు ఫిదా అయ్యారు. రూపాయి ఖర్చు లేకుండా సైకిల్‌పై హాయిగా ప్రయాణం చేసేలా ఆయన కార్యాచరణ చేశాడు. కొన్ని కర్రలను తీసుకొని సైకిల్‌ చుట్టూ సమాంతరంగా పేర్చి పందిరిలా ఏర్పాటు చేసుకున్నాడు. పైన ఎండ తగలకుండా, వర్షం పడకుండా పట్టా కట్టాడు. కాస్త వాటర్‌ చల్లుకొని రోడ్డుపైకి వెళ్తే చల్లగా జర్నీ సాగిపోతోంది. రోడ్డున వెళ్లే ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి నెట్టింట షేర్‌ చేశాడు. ఈ వీడియోకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

Read Also : Viral Video: బీరుతో హల్దీ ఫంక్షన్‌.. ఇదేం పిచ్చి నాయనలారా?

Exit mobile version