Viral Video : ప్రస్తుతం సమాజంలో పెళ్లిళ్లు చేసుకొనే తీరు మారుతోంది. ట్రెండ్‌కు అనుగుణంగా అందరూ మార్పు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి సందర్భంగా అనేక కార్యక్రమాలను చేపడుతూ సమాజంలో గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు పేదలకు, ఆపన్నహస్తం కోసం ఎదురు చూసే వారికి సాయం చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. తాజాగా ఓ వధువు ఇలానే చేసింది. తన పెళ్లి సందర్భంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పెళ్లి అంటే పేదలకు సాయం చేయడంతోపాటు సరికొత్తగా పనులు చేయొచ్చని ఈ యువతి నిరూపించింది. సాధారణంగా వివాహం సందర్భంగా ఆడంబరాలను మనం చూస్తుంటాం. అయితే, ఈ యువతి మాత్రం అందుకు కాస్త భిన్నంగా ప్రవర్తించింది. ఆడంబరాలకు పోకుండా వ్యవహరించింది. వధువు భారీగా మేకప్ వేసుకొని అందమైన డ్రెస్ మొదలుకొని కాస్ట్యూమ్స్ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, ఈ యువతి మాత్రం పెళ్లి సందర్భంగా తన జుట్టునే త్యాగం చేసింది.
క్యాన్సర్ రోగుల కోసం తన జట్టును కత్తింరించి సంచలన నిర్ణయం తీసుకుంది ఓ యువతి. పెళ్లి రోజే ఇలా చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వధువు చేసిన పనితో వివాహ రిసెప్షన్ అంతా చర్చనీయాంశమైంది. పలువురు ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. ఇక వధువు తరఫు బంధువులైతే పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. ఆనంద బాష్పాలు కార్చారు.
ఎవరూ చేయని పని చేస్తోంది..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు వినూత్న రీతిలో ఆమెను అభినందిస్తున్నారు. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఎవరూచేయని పని చేసిందంటూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. క్యాన్సర్ రోగుల కోసం ఆమె తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని ప్రశంసిస్తున్నారు. వెడ్డింగ్ డ్రస్ ధరించి మరీ హెయిర్ కట్ చేయించుకోవడం ఆమె ధైర్యానికి, సాయం చేసే గుణానికి నిదర్శనంగా నిలుస్తోందని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోకు విశేషంగా ఆదరిస్తున్నారు నెటిజన్లు.
watch video :
Also Read: