Telugu Flash News

Viral Video Today : బైక్ నడిపేటప్పుడు.. ఇవే… తగ్గించుకుంటే మంచిది!

viral videos

Viral Video Today : ప్రస్తుతం యువత బైకులపై వెళ్తూ ఫీట్లు చేయడం పెచ్చుమీరింది. రోడ్లపై వేగంగా వెళ్తూ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఫీట్లు చేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో కొందరు తీవ్ర గాయాలపాలవుతుంటారు. ఇందులో యువకులతో పాటు యువతులు కూడా తోడయ్యారు. అమ్మాయిలు సైతం పెద్ద పెద్ద బైక్‌లు నడుపుతూ ఫొటోలకు పోజులు ఇస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఓ యువతి హెవీ మోటార్‌ బైక్‌ను నడిపే క్రమంలో ప్రమాదానికి గురైంది.

సాధారణంగా హెవీ మోటార్‌ బైక్‌ను నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియోలు వైరల్‌ కావడం కోసం రోడ్డుపై ఎక్స్‌పర్టుల్లాగా ఫీట్లు చేస్తే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. తాజాగా వైరల్‌గా మారిన వీడియోలో.. ఓ యువతి బైక్‌ నడుపుతూ ఫొటోలకు, వీడియోలకు పోజులిచ్చింది. ఈ క్రమంలో బైక్‌ అదుపు తప్పింది. అయితే, అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలకు ముప్పు తప్పింది. బైకు నడపడంలో ఎంత అనుభవం ఉన్నా ఒక్కోసారి కాస్త అలసత్వం ప్రదర్శించినా ప్రమాదం తప్పదు.

ఈ వీడియోలో యువతి స్టైల్‌గా బైక్‌ నడపాలని ప్రయత్నించింది. పక్కన కొందరు వీడియో తీశారు. ఫొటోలకు పోజులిస్తున్న క్రమంలో బైక్‌ నడుపుతున్న యువతి పట్టు కోల్పోయింది. సడెన్‌గా బైక్‌ పై నుంచి కింద పడిపోయింది. అయితే, బైక్‌ కింద కాకుండా పక్కన పడిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. కెమెరావైపు చూస్తూ బైక్‌ నడపడమే ప్రమాదానికి కారణమైంది. తన రైడ్‌ను ఆస్వాదిస్తూ నవ్వుతూ ఫొటోలను పోజులివ్వడంతో బైక్‌పై పట్టు తప్పింది.

బైక్‌పై బ్యాలన్స్‌ కోల్పోయి ఎడమవైపు పడింది. బైక్‌ కొన్ని అడుగుల దూరం వరకు జారిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. బైక్‌ నడిపేటప్పుడు ఇవే.. తగ్గించుకుంటే మంచిదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఎంత అనుభవం ఉన్నా వాహనాలను నడిపేటప్పుడు ఏకాగ్రత ఉండాలని హితవు పలుకుతున్నారు.

also read :

Himanshu rao : ఓక్రిడ్జ్‌ స్కూల్‌లో కాస్నివాల్‌ వేడుక.. కేసీఆర్‌ మనవడు హిమాన్షు నాయకత్వం..

RGV : పవన్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటంటూ వర్మ ట్వీట్లు

Exit mobile version